ఆ కమెడియన్ కు సర్ప్రైజ్ ఇచ్చిన సూపర్ స్టార్.. పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో విజయ్ దళపతి ఒకరు.ఈయన రజనీకాంత్ తర్వాత తమిళ్ లో అంతటి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.

 Thalapathy Vijay Gift To Yogi Babu Details, Yogi Babu, Thalapathy Vijay, Rashmik-TeluguStop.com

వరుస హిట్స్ తో వందల కోట్లు వసూళ్లు చేస్తూ కోలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డమ్ అందుకున్నాడు.దీంతో ఈయనకు సినీ సెలెబ్రెటీల్లో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది.

తన సినిమాలతో మంచి ట్రీట్ ఇస్తున్న విజయ్ తాజాగా ఒక కమిడియన్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం వైరల్ గా మారింది.

ఆ కమెడియన్ ఎవరంటే యోగిబాబు అని తెలుస్తుంది.

యోగిబాబు కు విజయ్ సర్ప్రైజ్ గిఫ్ట్ గా హెల్మెట్, బ్యాట్ ను పంపించారట.వాటిని పెట్టుకుని సోషల్ మీడియా వేదికగా ఫోటో షేర్ చేసి తన ఆనందం తెలిపాడు.

విజయ్, యోగిబాబు కాంబోలో చాలా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.సర్కార్, బిగిల్ వంటి సినిమాలు రాగా ప్రెజెంట్ విజయ్ చేస్తున్న వరిసు సినిమాలో కూడా ఈయన నటిస్తున్నాడు.

ప్రెజెంట్ విజయ్ తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు సినిమా చేస్తున్నాడు.విజయ్ దళపతి నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా షూట్ పూర్తి అయ్యింది.దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది.

ఈ సినిమాలో ఖుష్బూ, మీనా, శ్రీకాంత్, జయసుధ, యోగిబాబు, శరత్ కుమార్ వంటి వారు నటిస్తున్నారు.సంక్రాంతిలో భారీ పోటీ మధ్య ఈ సినిమాను దిల్ రాజు రిలీజ్ చేస్తుండగా ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

గత సినిమా బీస్ట్ తో ప్లాప్ అందుకున్న విజయ్ ఈ సినిమాతో అయిన సూపర్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube