ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ నిలిపేయాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ… ఆ నలుగురు తమకు ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ మిగతా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ మండిపడ్డారు డా.ప్రతాని రామకృష్ణ గౌడ్.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమలో మాట్లాడుతూ…“ ఫిలిం ఇండస్ట్రీ ఎదుర్కొంటోన్న కొన్ని సమస్యల పై స్పందిచడానికి ఈ రోజు మా తెలంగాణ ఫిలించాంబర్ తరఫున ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం.మా టియఫ్‌సీసీ లో ప్రస్తుతం యాభై మంది నిర్మాతలు సినిమా షూటింగ్ లు నిర్వహిస్తున్నారు.
నా సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది.ఇంకా రెండు రోజులే బేలన్స్ ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్స్ ఆకస్మాత్తుగా ఆపేస్తే వర్కర్స్ తో పాటు మిగతా వారందరికీ ఇబ్బంది కలుగుతుంది.ఆగస్ట్ 1 నుండి షూటింగ్స్ నిలిపివేస్తున్నారని పత్రికల్లో, ఛానల్స్ లో వార్తలు చదువుతున్నాం.
అసలు షూటింగ్స్ ఎందుకు నిలిపివేస్తున్నారో తెలియని పరిస్థతి.కొందరు తమ స్వార్థం కోసం ముఖ్యమంత్రులను ఒకటికి నాలుగుసార్లు కలిసి టికెట్ రేట్లు పెంచుకున్నారు.మళ్లీ థియేటర్స్ కి ఆడియన్స్ రావడం లేదనీ షూటింగ్స్ నిలిపివేయాలంటున్నారు.అసలు ఇది ఎంత వరకు కరెక్టో అర్థం కావడం లేదు.
సినిమా షూటింగ్స్ అయితే ఆపే సమస్య లేదు.అందర్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి కానీ, మీకు మీరే టికెట్ రేట్లు పెంచాలి, షూటింగ్స్ బంద్ చేయాలంటూ నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు.
ఇప్పటికే కరోనా వల్ల ఎంతో మంది వర్కర్స్ షూటింగ్స్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు.కరోనా సమయంలో మా చాంబర్ తరపున 20 వేల మంది కార్మికులకు సాయం చేశాం.
అలాంటి పరిస్థితుల నుంచి తేరుకొని ఇప్పుడిప్పుడే షూటింగ్స్ జరుపుకుంటోన్న సమయంలో ఇలా షూటింగ్స్ ఆకస్మాత్తుగా ఆపడం సమజసం కాదు.వాళ్లకు కలెక్షన్స్ రావడం లేదనీ ఓటీటీ కి ఇవ్వొద్దు అని అంటున్నారు.
మా సినిమాలకు మీరు థియేటర్స్ ఇవ్వరు, ఓటీటీ కి సినిమాలు ఇవ్వొద్దు అంటే చిన్న నిర్మాతలు బతికే దెలా? ఆ పదిమంది నిర్మాతలే బతకాలా? మీకు లాభాలు వచ్చినప్పుడు సైలెంట్ గా ఉండి.మీకు ఇబ్బంది వస్తే రూల్స్ మార్చడం, షూటింగ్స్ నిలిపేయడం కరెక్టా? పర్సెంట్ విధానం ఎందుకు తీసుకరావడం లేదు.ఇండస్ట్రీ మీద అంత ప్రేమ ఉంటే పర్సెంట్ విధానం మీద సినిమాలు రిలీజ్ చేయండి.నిర్మాతలు , డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబీటర్స్ అన్నీ ఆ నలుగురు నిర్మాతలే.తెలంగాణలో ఇంతకు ముందు 200 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవారు.ఇప్పుడు ఒక్కరూ లేరు.
కేవలం నలుగైదరు నిర్మాతల చేతుల్లో థియేటర్స్ ఉండటం వల్ల ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడింది.ఎప్పుడూ వాళ్ల స్వార్థమే తప్ప మిగతా వాళ్లకు ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు.
వాళ్లకు వాళ్లే సపరేట్ గా మీటింగ్స్ పెట్టుకుని వాల్లే డెసిషన్స్ తీసుకోవడం చాలా తప్పు.దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నాం.
షూటింగ్స్ కచ్చితంగా జరుగుతాయి.ఎవరి షూటింగ్స్ అయినా ఆపితే ప్రభుత్వం ద్వారా, మా చాంబర్ ద్వారా వారిని ఎదుర్కొంటాం.
పెద్ద హీరోలను తీసుకెళ్లి థియేటర్స్ టికెట్ రేట్లు పెంచమని ముఖ్యమంత్రులను అడిగింది మీరు.
ఒక సామాన్యుడు కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే జేబుకు చిల్లి పడే పరిస్థితి.ఒక్క సినిమా హిట్ కాగానే పోటీ పడి హీరోలకు రెమ్యూనిరేషన్స్ పెంచేది మీరే.అవసరమైతే మీరు సినిమాలు తీయడం ఆపేయండి.
అంతే కానీ ఇండస్ట్రీని బంద్ చేయడానికి మీరెవరు.ఆ పదిమంది ప్రొడ్యూసర్స్ ఏడాదికి 40 సినిమాలు చేయవచ్చు…వాళ్ల వల్ల వర్కర్స్ బతకడం లేదు.
చిన్న సినిమాల వల్లే కళాకారులు బతుకుతున్నారు.నిజంగా ఏదైనా సమస్య ఉంటే అందర్నీ పిలిచి మాట్లాడి నిర్ణయం తీసుకోండి.అంతేకానీ ఇలా అకస్మాత్తుగా షూటింగ్స్ ఆపేయాలంటే అందరికీ ఇబ్బంది.చాలా సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.కాబట్టి థియేటర్స్ బంద్ అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.టికెట్స్ రేటు తగ్గించాలి.
థియేటర్స్ లో అమ్మే తినుబండారాల రేట్లు తగ్గించాలి.ఓటీటీకి ఎనిమిది, పది నెలల తర్వాతే ఇవ్వాలంటే నిర్మాతకు ఇబ్బంది అవుతుంది.
దీనిపై కూడా పునరాలోచించాలి.అందర్నీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఎవరికి వాళ్లే నిర్ణయాలు తీసుకొని మిగతా వాళ్లను ఇబ్బంది పెట్టొద్దు“ అన్నారు.
తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ఏ.గురురాజ్ మాట్లాడుతూ…“ కొంత మంది సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నారు.పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు అంటూ ఎవరూ లేరు.ప్రతి ఒక్కరూ చిన్న నిర్మాత నుంచి పెద్ద నిర్మాతగా ఎదిగినవారే.నేను కూడా చాలా చిత్రాలు నిర్మించాను.కానీ సరైన థియేటర్స్ దొరక్క ఎంతో నష్టపోయాను.
షూటింగ్స్ బంద్ చేయడానికి మీకు అధికారం లేదు.సామాన్యుడు ప్రస్తుతం సినిమా చూడాలంటే భయపడుతున్నాడు.
కారణం టికెట్ల రేట్లు, తినుబండారాల రేట్లు పెంచడం. ముందు వీటిని తగ్గించండి.
అంతే కానీ షూటింగ్స్ నిలిపేస్తే వచ్చేది ఏం లేదు.ఎవరైనా తమ షూటింగ్స్ ఆపారని మమ్మల్ని సంప్రదిస్తే మేము ప్రభుత్వం సపోర్ట్ తో వారిని ఎదుర్కొంటాం“ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సెక్రటరి సాగర్, హీరో సురేష్ బాబు, చెన్నారెడ్డి, కిషోర్, సతీష్, రాఖీ తదితరులు పాల్గొన్నారు.