దేశంలో కరోనా వల్ల రోజు రోజుకు చాలా ప్రాణాలు పోతున్నాయని ప్రజలు భయపడుతుంటే మరో వైపు అగ్ని దేవుడు కూడా పగబట్టినట్లుగా ఉన్నాడు.ముఖ్యంగా కరోనా పేషెంట్స్‌కు ట్రీట్‌మెంట్ ఇస్తున్న ఆస్పత్రుల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి.
తాజాగా మహారాష్ట్రలోని థానేలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు రోగులు మృత్యువాత పడ్డారు.ఈ విషాద ఘటన గురించిన వివరాలు తెలుసుకుంటే.ఈ తెల్లవారు జామున సుమారుగా 3.40 గంటలకు ముంబ్రా ప్రాంతంలోని కౌశాలో ఉన్న ప్రైమ్ క్రిటికేర్ ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయట.
కాగా ఈ ప్రమాదంలో ఆసుపత్రిలో కొవిడ్ కు చికిత్స తీసుకుంటున్న నలుగురు పేషెంట్లు మృతి చెందారని, మిగతా రోగులను వేరే ఆసుపత్రికి తరలించామని ఇక్కడి సిబ్బంది వెల్లడించారు.ఇకపోతే ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారట.