నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం సరంపేటలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పరస్పరం ఎదురుపడ్డారు.
పరస్పరం నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.దీంతో ఉద్రిక్తత నెలకొంది.
సరంపేటలో ఓ వైపు టీఆర్ఎస్ నేతల రోడ్ షో జరుగుతుంది.ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ నేల రోడ్ షోకు బీజేపీ బైక్ ర్యాలీ ఎదురైంది.
ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు నినాదాలు చేశారు.అయితే మునుగోడు ఉపఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది.
ప్రచారం నిర్వహించే క్రమంలో చివరి నిముషంలోనూ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.







