టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా పాపులర్ అయ్యాడు.సుకుమార్ దర్శకత్వంలో గతేడాది విడుదలైన పుష్ప సినిమా అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.
ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది.దీంతో నార్త్ ఇండస్ట్రీలో ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీతో సైతం అల్లు అర్జున్ కి అభిమానులుగా మారిపోయారు.
ఇలా ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ పాపులర్ అయ్యాడు.పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ తన సినిమాల మీద మరింత దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటున్న బన్నీ కుటుంబం కోసం కూడా తన సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు.ఇలా తరచూ తన భార్య పిల్లలతో కలిసి విదేశాలలో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
ఇక అల్లు అర్జున్ కి తన కూతురు అర్హ అంటే చాలా ఇష్టం.కూతురు పుట్టిన తర్వాత తనతో కలిసి అల్లు అర్జున్ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు.
ఇలా తండ్రి కూతురు మధ్య సరదా సన్నివేశాలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోల రూపంలో షేర్ చేస్తూ ఉంటాడు.

తాజాగా అల్లు అర్జున్, అర్హకి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కూతురి కోరిక మేరకు అర్ధరాత్రి సమయంలో అల్లు అర్జున్ లాంగ్ డ్రైవ్ కి తీసుకువెళ్లి తనకిష్టమైన ఫుడ్ తినిపించినట్లు తెలుస్తోంది.స్టార్ హీరోగా పాపులర్ అయిన అల్లు అర్జున్ ఇలా అర్ధరాత్రి సమయంలో కూతురి కోసం ప్రజలలోకి వెళ్ళటంతో అందరూ షాక్ అవుతున్నారు.
అల్లు అర్జున్ అర్హ ఇద్దరూ కలిసి కారులో ఆహారం తింటున్న ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.ఇలా అల్లు అర్జున్ తన కూతురి కోరికను నెరవేర్చి కూతురి మీద ఉన్న ప్రేమను మరొకసారి నిరూపించుకున్నాడు.








