ఏపీలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు( Assembly meetings ) కొనసాగుతున్నాయి.రాష్ట్రంలో ధరల పెరుగుదల, విద్యుత్ ఛార్జీలకు( Electricity charges ) వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు.
బాదుడే బాదుడు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.టీడీపీ సభ్యుల నినాదాలతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
అలాగే ధరల పెరుగుదలపై టీడీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేయగా స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు.దీంతో స్పీకర్ పోడియాన్ని చుట్టిముట్టిన టీడీపీ సభ్యులు పేపర్లను చింపి స్పీకర్ తమ్మినేనిపై విసిరారు.
స్పీకర్ తమ్మినేని( Tammineni Sitaram )పై పేపర్లు వేయడంపై మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.స్పీకర్ పై పేపర్లు వేయడం తీవ్ర అవమానకరమని పేర్కొన్నారు.స్పీకర్ పై ఈ విధంగా చింపివేయడం దుర్మార్గమైన చర్యని తెలిపారు.టీడీపీ సభ్యులకు ఇష్టం లేకపోతే బయటకు వెళ్లాలని మంత్రి అంబటి సూచించారు.
.