టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) కూటమిగా ఏర్పడి, ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి.పొత్తులో భాగంగా ఈ మూడు పార్టీలు సీట్లను సర్దుబాటు చేసుకోవడంతో పాటు, అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేశాయి.
ఇక విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, ప్రజలలో తిరుగుతూ తమ గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.అయితే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పొత్తులో భాగంగా టిడిపి జనసేన కు కేటాయించిన సీట్ల విషయంలో.
ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడిన నేతలు ఎంతవరకు సహకరిస్తారనేది ఇప్పటికీ ప్రశ్నార్థంగానే మారింది.పొత్తులో భాగంగా జనసేన బిజెపికి కేటాయించిన సీట్లలో వారు గెలిస్తే.
రాబోయే రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్తుకు గండి పడుతుందనే టెన్షన్ వారిలో నెలకొంది .
![Telugu Ap, Chandrababu, Janasena, Janasenani, Pavan Kalyan, Alliance Candis-Poli Telugu Ap, Chandrababu, Janasena, Janasenani, Pavan Kalyan, Alliance Candis-Poli](https://telugustop.com/wp-content/uploads/2024/04/tension-for-alliance-candidatesc.jpg)
దాదాపు చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుండడంతో, నియోజకవర్గల్లో( constituencies ) పోటీ చేస్తున్న అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు.బిజెపి 10, జనసేన 21 ,టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది.అయితే బిజెపి, జనసేనకు కేటాయించిన స్థానాల్లో టిడిపి నేతల సహకారం ఎంతవరకు ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది .గతంలో పొత్తులో భాగంగా కోల్పోయిన నియోజకవర్గాలు ఇప్పటికీ తమ చేతుల్లోకి రాలేదన్న అభిప్రాయం టిడిపి నేతల్లో ఉందట.ఒకసారి ఈ నియోజకవర్గంలో జనసేన లేదా బిజెపి గెలిస్తే ఆ తర్వాత ఎన్నికల్లోనూ ఇవే నియోజకవర్గాలు పొత్తులో భాగంగా కోరుతాయని, తాము ఇక పోటీ చేసేందుకు అవకాశం ఉండదనే అభిప్రాయంతో పరోక్షంగా సహాయ నిరాకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
![Telugu Ap, Chandrababu, Janasena, Janasenani, Pavan Kalyan, Alliance Candis-Poli Telugu Ap, Chandrababu, Janasena, Janasenani, Pavan Kalyan, Alliance Candis-Poli](https://telugustop.com/wp-content/uploads/2024/04/tension-for-alliance-candidatesd.jpg)
తాము ఎన్నికల ప్రచారంలో జనసేన , బీజేపీ అభ్యర్థుల తరఫున పాల్గొంటున్నా, తమ క్యాడర్ కు మాత్రం వ్యతిరేకంగా పనిచేయాలని సంకేతాలు పంపిస్తున్నారట.జనసేన విషయంలోనూ ఇదే పరిస్థితి ఉందట .ఒకసారి జనసేన బీజేపి జెండా ఎగిరితే , తమను ఒక పట్టించుకోరని , వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం ఉండదని ఆందోళన చెందుతున్నారట .చాలా చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో అభ్యర్థులు తమ పార్టీ అధినేతల వద్ద తమ ఆవేదనను వెళ్ళగకుతున్నారట.