భద్రాద్రి జిల్లా సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కార్యాలయం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.

సింగరేణి ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు అనుమతి లేదని సిబ్బంది చెబుతున్నారు.ఈ నేపథ్యంలో కార్మికులకు, సిబ్బందికి మధ్య వాగ్వివాదం చెలరేగింది.

దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.ఈ క్రమంలోనే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసనకు దిగారు.

అయితే ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును అడ్డుకోవడంపై సింగరేణి యాజమాన్యం ఫైర్ అయింది.సెక్యూరిటీ చీఫ్ తో పాటు సిబ్బందిపై యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలుస్తోంది.

Advertisement

అనంతరం ఎమ్మెల్యే కూనంనేని ప్రచారానికి అనుమతి ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలుస్తోంది.

తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!
Advertisement

తాజా వార్తలు