హైదరాబాద్ రాజ్‌భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.రాజ్‌భవన్ ఎదుట జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు నిరసనకు దిగారు.
గవర్నర్ తమిళిసై తమకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో రాజ్‌భవన్ వద్దకు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యల చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు మేయర్ తో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరిన విషయం తెలిసిందే.
అయితే గవర్నర్ తమిళిసై వారిని కలిసేందుకు అనుమతి నిరాకరించారు.దీంతో గవర్నర్ పై బీఆర్ఎస్ మహిళా నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో రాజ్‌భవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది.







