హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు.
ఇందులో భాగంగా జగదేవ్ పూర్ మండలం తీగుల్ కు షర్మిల వెళ్లనున్నారు.
దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయని ఇటీవల తీగుల్ లో స్థానికులు ఆందోళన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తీగుల్ వెళ్లేందుకు షర్మిల సిద్ధం అయ్యారు.అయితే షర్మిల వెళ్లకుండా లోటస్ పాండ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
అదేవిధంగా షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.మరోవైపు పోలీసుల తీరుపై తీవ్ర అసహానం వ్యక్తం చేసిన షర్మిల వారికి హారతి ఇచ్చి నిరసన తెలిపారు.
దీంతో లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.