బార్బీబొమ్మగా మారిన టెన్నిస్ క్రీడాకారిణి..!

టోక్యో నగరంలోపారాలింపిక్స్ పోటీలు ఎంతో ఘనంగా జరుగుతాయన్న విషయం అందరికి తెలిసిందే.

ఈ పోటీలకు దాదాపు160 దేశాల నుంచి సుమారు 4 వేలకు ఎక్కువగానే అథ్లెట్లు తమ దేశానికి గుర్తింపు తేవాలనే లక్ష్యంతో పోటీల్లో పాల్గొన్నారు.

ఈ పోటీలు ప్రారంభ వేడుకలో చిలీ జట్టు బేరర్‌గా ఉన్న 43ఏళ్ల ఫ్రాన్సిస్కా మర్డోన్స్ తన దేశానికి వీల్‌చైర్ టెన్నిస్‌ లో ప్రాతినిధ్యం వహించింది.అంతేకాకుండా షాట్‌ పుటింగ్, డిస్కస్ త్రో, జావెలిన్ క్రీడల్లోనూ ఆమె తన ప్రతిభను కనబరచనుంది.

ఈ క్రమంలోనే ప్రఖ్యాతి చెందిన మాటెల్ బార్బీ బొమ్మల తయారీ సంస్థ మర్దోన్స్ వీల్ చైర్ లో కూర్చున్న బార్బీ బొమ్మను తయారుచేయడం చెప్పుకోదగ్గ విషయం అనే చెప్పాలి.అసలు మర్డోన్స్‌ కు అలా వీల్ చైర్ లో కూర్చోవడానికి కారణం ఏంటంట మర్డోన్స్ కి చిన్నతనం నుంచి ఒలింపిక్ అథ్లెట్ అవ్వాలనే కోరిక ఉండేది.

కానీ 1999లో ఆమె పనిచేస్తున్న ప్యూర్టోరికా ద్వీపంలో హరికేన్ సమీపంలో ఉన్న కొండచరియలు విరిగి ఆమెమీద పడడంతో ఆమె వెన్నెముక పూర్తిగా దెబ్బతింది.దింతో ఆమె అప్పటినుంచి వీల్ చైర్‌ లోనే ఉండసాగింది.

Advertisement

ఎన్నో ఆపరేషన్లు చేయించుకున్న తరువాత నాలుగేళ్లకు కోలుకున్నది.అప్పటినుంచి వీల్‌ చైర్ లోనే కూర్చుని టెన్నిస్‌ ను ప్రాక్టీస్ చేసి, ఆస్టిన్‌లోని గ్రే రాక్ టెన్నిస్ క్లబ్‌లో ఆడటం మొదలు పెట్టింది.

తన టాలెంట్ తో చిలీ జట్టుకు ఎన్నికై పరాపన్ అమెరికన్ గేమ్స్‌ లో పాల్గొని తన సత్తా ఏంటో చూపింది.వరసగా 2007, 2011 లో రెండు కాంస్య పతకాలు సాధించింది.

అలాగే మరెన్నో అవార్డులను కూడా కైవసం చేసుకుంది.

ఇలా విజయవంతంగా కెరీర్ ముందుకు వెళ్తున్న సమయంలో అనుకోకుండా 2017లో నరాలు పాడయిపోవడంతో ఆమె కుడిచేయి తీసివేసే పరిస్థితి వచ్చింది.అయినాగానీ నిరాశ చెందని మర్డోన్స్ జావెలిన్, డిస్కస్ త్రో, షాట్ పుట్ కొనసాగిస్తూ వచ్చింది.తరువాత కొంత కాలానికి టెన్నిస్ నుంచి విరామం తీసుకుంది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
కోటి ఆశలతో స్వదేశానికి బయలుదేరిన ఎన్నారై మహిళ... అంతలోనే విషాదం..?

తరువాత షాట్‌ పుట్‌ విభాగంలో 2019 ప్రపంచ రికార్డు సృష్టించింది మర్డోన్స్.ఇలా పారాఒలంపిక్ క్రీడల్లో ఆమె కృషిని గుర్తించిన బార్బీ కంపెనీ మాటెల్ మర్డోన్స్ బొమ్మను విడుదల చేసి ఆమెకు ప్రపంచంలో ఒక గుర్తింపును తీసుకువచ్చింది.అంగవైకల్యం అనేది మనం చేరుకోబోయే లక్ష్యాలకు అడ్డుగా మారకూడదు.

Advertisement

ఏదైనా సాధించాలి అన్న పట్టుదల మనలో ఉంటే దేనినైనా సాధించగలము.ఈ బార్బీ బొమ్మ పిల్లల్లో మరింత స్ఫూర్తిని కలిగిస్తుందని ఆశిస్తున్నాను అంది.

క్రీడల కోసం ఎన్నో ఏళ్లుగా నేను చేస్తున్న కృషికి ఈ బార్బీ బొమ్మ ఒక గుర్తింపు అని మర్డోన్స్ తెలిపింది.

తాజా వార్తలు