చికాగోలో నాట్స్ ఆధ్వర్యంలో తెలుగువారి విహారయాత్ర..!

అమెరికాలో తెలుగుజాతిని ఒక్కటి చేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా భారతీయ అజాదీ అమృతోత్సవ్‌లో భాగంగా చికాగోలో తెలుగువారితో విహారయాత్ర ఏర్పాటు చేసింది.200 మందికి పైగా తెలుగు కుటుంబాలు ఈ విహారయాత్రలో పాలుపంచుకున్నాయి.పార్క్‌లో పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహాంగా ఆట, పాటలతో అమృతోత్సవ సంబరాలు చేసుకున్నారు.ఈ విహార యాత్రలో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు ఇమిటేషన్ రాజు నవ్వులు పూయించారు.

 Telugu Vacation In Chicago Under The Auspices Of Nats , Telugu Vacation, Nats, C-TeluguStop.com

డీజేసందీప్ సినిమా పాటల ప్రదర్శన అందరిలోనూ ఉత్సాహం నింపింది.కొత్తగా ఏర్పాటైన చాప్టర్ కోఆర్డినేటర్ హరీశ్ జమ్ముల ఈ విహార యాత్ర నిర్వహణ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు.

హరీశ్ తన టీం సభ్యులైన బిందు వీధులమూడి, వీర తక్కెళ్లపాటి, భారతి పుట్ట, రోజా శీలంశెట్టి, నరేంద్ర కడియాల, కార్తీక్ మోదుకూరి రాజయ్య వినయ్‌తో కలిసి చక్కటి ప్రణాళికతో ఈ విహార యాత్రను విజయవంతం చేశారు.

చికాగో నుంచి నాట్స్ ఈసీ నాయకులు మదన్ పాములపాటి, కృష్ణ నిమ్మగడ్డ, ఆర్.కె బాలినేని, లక్ష్మి బొజ్జా ఈ విహార యాత్ర దిగ్విజయం కావడానికి తమ పూర్తి సహకారాన్ని అందించారు.చికాగో నుంచి మద్దతు అందించిన మూర్తి కొప్పాక, శ్రీను అరసాడ, శ్రీనివాస్ బొప్పన, రవి శ్రీకాకుళం తదితరులకు నాట్స్ బోర్డ్ ధన్యవాదాలు తెలిపింది.

ఇంకా ఈ విహార యాత్ర కోస నాట్స్ చికాగో చాప్టర్ వాలంటీర్లు వేణు కృష్ణార్దుల, శ్రీనివాస్ పిడికిటి, మహేష్ కాకరాల, లేఖ నిమ్మగడ్డ, పాండు చెంగలశెట్టి, అంజయ్య వేలూరు, గోపాల్ రెడ్డి, శ్రీకాంత్ బొజ్జా, శిల్పా యర్రా, రాధిక కోగంటి, సుమతి నెప్పలి, నరేశ్ యాడ, సాంబశివరావు, అరుష్ నిమ్మగడ్డ, వర్షిత్ తక్కెళ్లపాటి, సంకేత్, రాజేశ్ వీధులమూడి తదితరులు ఈ విహార యాత్ర కోసం విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.బౌల్ ఓ బిర్యానీ మరియు బావార్చి వారు ఈ విహార యాత్ర లో పాల్గొన్న అందరికీ చక్కటి విందు ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube