చరణ్, తారక్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చే శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ సినిమాకు రేట్లను పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చాయి.
అయితే ఆర్ఆర్ఆర్ మూవీని థియేటర్లలో చూడాలని భావించిన ప్రేక్షకులు పెరిగిన టికెట్ రేట్లను చూసి షాకవుతున్నారు.కనీసం 150 రూపాయల నుంచి గరిష్టంగా 400 రూపాయల వరకు ఈ సినిమా టికెట్ రేట్లు ఉన్నాయి.
బుక్ మై షో, పేటీఎం లాంటి యాప్స్ లో టికెట్లను బుకింగ్ చేసుకుంటే సర్వీస్ ఛార్జీలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.ఏపీలో టికెట్ రేట్లను తగ్గించడం వల్ల కొన్నిరోజుల క్రితం టాలీవుడ్ జనాలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
ప్రేక్షకులే ఆశ్చర్యానికి గురయ్యేలా భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ వరకు ఏపీలో టికెట్ రేట్లు ఉన్నాయి.అయితే ఏపీ ప్రభుత్వం కొత్త టికెట్ల జీవోను అమలులోకి తీసుకొనిరావడంతో పాటు రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్ రేట్లను పెంచుకునే ఛాన్స్ ఇచ్చింది.
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా 75 రూపాయల మేర రేట్లు పెంచుకోవడానికి ఏపీ సర్కార్ నుంచి అనుమతులు లభించాయి.
ఆర్ఆర్ఆర్ సినిమాను థియేటర్లలో చూడాలని భావిస్తున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభిమానులకు టికెట్ రేట్లు షాకిచ్చేలా ఉన్నాయి.హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో రెండు ఎగ్జిక్యూటివ్ టికెట్లను బుకింగ్ చేస్తే సర్వీస్ ఛార్జీలతో కలిపి 901 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.

ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్లకు సంబంధించి సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి.ఈ టికెట్ రేట్లతో ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ఆర్ఆర్ సినిమాను చూడటం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తీసుకోండి సార్ మా ఆస్తి పేపర్లు అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్ల గురించి మీమ్స్ వైరల్ చేస్తున్నారు.







