ఇద్దరు మిత్రులకు అతిపెద్ద సవాళ్లు ఇవేనా ?

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరి గురించి చెప్పుకుంటే ఎంత మొండివారో ఎంత ముందు చూపు ఉన్నవారో ఇట్టే అర్ధం అయిపోతుంది.

ఎంత పెద్ద సమస్యనైనా అతి సులువుగా తమ తెలివితేటలతో పరిష్కరించుకోగలిగిన సత్తా ఈ ఇద్దరి సొంతం.

అంత సామర్ధ్యం ఉన్న ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఎక్కడలేని స్నేహబంధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.రెండు రాష్ట్రాల సమస్యల మీద ఈ ఇద్దరూ కలిసి కూర్చుని చక్కటి పరిష్కార మార్గాన్ని ఏరుకుంటూ స్నేహ బంధం కొనసాగిస్తున్నారు.

అయితే ఈ ఇద్దరికీ ఆయా రాష్ట్రాల్లో తీరని సమస్యలు వెంటాడుతున్నాయి.తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడలేని అపఖ్యాతి మూటగట్టుకుంటూ విమర్శలపాలవుతోంది.

ఈ విషయంలో సాక్షాత్తు హైకోర్టు కలుగజేసుకున్నా ఈ సమస్యకు పరిష్కార మార్గం కనిపించడంలేదు.

Advertisement

అలాగే ఏపీ లో జగన్ ఇసుక కొరత వివాదంలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు.ప్రతిపక్ష పార్టీలన్నీ దాదాపు ఏకమై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేస్తున్నాయి.వాతావరణ పరిస్థితుల కారణంగా నెలకొన్న ఇబ్బందిని ప్రధాన ప్రతిపక్షం రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది.

అయితే ఈ విషయంలో ప్రజల నుంచి ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ లేదు.విస్తారంగా వర్షాలు కూడా పడుతుండడంతో భవన నిర్మాణ పనులు కూడా చేపట్టేందుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నారు.

అదే సమయంలో తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది.ఆర్టీసీ కార్మికుల సమ్మె మీద తొలుత ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉన్నా అది మితిమీరిన స్థాయిలో లేదు అనడానికి హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయని టీఆర్ఎస్ వాదిస్తోంది.

సమ్మెను పరిష్కరించే సత్తా కేసీఆర్ కు ఉన్నప్పటికీ కేవలం తన మాట వినటం లేదన్న కోపంతో కార్మికుల సమస్యల పరిష్కారం మీద మంకుపట్టు పడుతున్నట్టు కనిపిస్తోంది.సమ్మె విషయంలో ప్రభుత్వం, కార్మికులు ఒక మెట్టు దిగాలన్న మాటను చెప్పిన హైకోర్టు తాజాగా మాత్రం అందుకు భిన్నంగా సమ్మెను ఆపమని తాము చెప్పలేమన్న మాటను చెప్పటం చూస్తే ప్రభుత్వ వైఖరి విషయంలో కోర్టు కూడా గుర్రుగా ఉందన్న విషయాన్ని రుజువు చేస్తోంది.ఇలా ఈ రెండు విషయాల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ సతమతం అవుతున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

ఈ రెండు సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికే వరకు ఇదే ఇబ్బంది తప్పదని అప్పటివరకు ఇదే పరిస్థితి ఈ ఇద్దరూ ఎదుర్కోక తప్పని పరిస్థితి ఈ ఇద్దరు మిత్రులకు ఏర్పడినట్టుగా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు