అమెరికా కోర్టు సంచలన తీర్పు...తెలుగు వ్యక్తికి రూ.376 కోట్లు నష్టపరిహారం..!!!

అమెరికాలో వెలుగు చూసిన కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది.

నకిలీ బిల్లులు సృష్టించి అమెరికా వైద్య రంగంలో ఎన్నడూ జరగని విధంగా ఓ భారీ కుంభకోణానికి కారణమయిన ఓ తెలుగు వ్యక్తిపై అమెరికా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అతడు చేసిన ఈ పనికి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.అంతేకాదు 20 ఏళ్ళ పాటు అమెరికా జైల్లో మగ్గేలా కోర్టు సంచలన తీర్పు చెప్పింది.

పెద్దన్న అమెరికాకే ఘలక్ ఇచ్చి ఈ స్థాయిలో శిక్ష పడటానికి అతడు చేసిన నేరం ఏమిటి.అమెరికాలో అతడు ఏమి చేసేవాడు అనే వివరాలలోకి వెళ్తే.

అమెరికా ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తుంది.అక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే హెల్త్ కేర్ పధకంలో పెద్ద మొత్తంలో కుంభకోణం జరిగిందని గుర్తించిన అధికారులు తీగ లాగితే డొంక కదిలినట్టుగా భారతీయ అమెరికన్ అయిన త్రివిక్రమ్ రెడ్డి అనే తెలుగు వ్యక్తి పాత్ర అత్యంత కీలకంగా ఉందని గుర్తించారు పోలీసులు.అమెరికాలో ప్రాక్టీస్ నర్సుగా చేస్తున్న త్రివిక్రమ్ రెడ్డి నర్సు లైసెన్స్ తో ఓ క్లీనిక్ ను నడపడమే కాకుండా అక్కడికి వస్తున్నా రోగుల పేరుతో నకిలీ ట్రీట్మెంట్ రికార్డులు సృష్టించి పెద్ద మొత్తంలో ఇన్స్యూరెన్స్ కంపెనీల నుంచీ సుమారు రూ.40 కోట్ల డబ్బు దోచేశాడు .

Advertisement

అయితే గడిచిన సంవత్సరం కొందరి నుంచీ వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు వెళ్లి సోదాలు చేయగా నకిలీ బిల్లులు, రికార్డులు కనపడటంతో అతడిని అరెస్ట్ చేసి అప్పటి నుంచీ విచారణ చేపట్టారు.అమెరికా హెల్త్ కేర్ పధకానికి తీవ్ర నష్టం వాటిల్లేలా అతడు మోసం చేశాడని అమెరికా అటార్నీ వెల్లడించింది.చివరికి పూర్తీ సాక్ష్యాధారాలతో త్రివిక్రమ్ రెడ్డి మోసం బయటపడటంతో అమెరికా కోర్టు అతడికి 20 ఏళ్ళ పాటు జైలు శిక్ష విధించడంతో పాటు ప్రభుత్వాన్ని కంపెనీలకు మోసం చేసినందుకు గాను రూ.376 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది.

ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?
Advertisement

తాజా వార్తలు