తెలుగు ఎన్.ఆర్.ఐ డైలీ న్యూస్ రౌండప్

1.దుబాయ్ వెళ్లే వారికి శుభవార్త

చెన్నై నుంచి దుబాయ్ వెళ్లే ప్రయాణికులు ఇకపై కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అవసరం లేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

2.కాంగో లో నిరసనకారుల దుశ్చర్య భారతీయులకు భారీ నష్టం

కాంగోలో భారతీయుల వ్యాపార సముదాయాల పై కొందరు నిరసనకారులు దాడులకు దిగారు.ఇటీవల బెంగళూరులో కాంగో యువకుడు పోలీసుల అదుపులో ఉండగా మరణించడంతో,  దానికి నిరసనగా కాంగో దేశ పౌరులు అక్కడ భారతీయ వ్యాపార సముదాయాల పై దాడులకు దిగారు.

3.భారత ప్రయాణికులపై నిషేధాన్ని పొడిగించిన ఫిలిఫిన్స్

భారత్తో సహా పలు దేశాల ప్రయాణికులపై ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఆంక్షలను పొడిగించింది.ఏప్రిల్ 27న తొలిసారి ప్రయాణికులపై ఆంక్షలు విధించిన ఫిలిఫిన్స్ అప్పటి నుంచి ఈ నిషేధాన్ని పొడిగిస్తూ వస్తోంది.

4.ప్రవాసులకు భారత ఎంబసీ కీలక సూచన

పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఈ విషయమై యూఏఈ లో ఉంటున్న భారతీయులకు అబుదాబీ లోని ఇండియన్ ఎంబసీ తాజాగా ఒక సూచన చేసింది.ఇకపై పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అవసరం ఉన్న ప్రవాసులు స్థానిక పోలీసులు అనుమతి లేకుండా దీన్ని నేరుగా పొందవచ్చని తెలియజేసింది.

5.అమెరికాలో కరోనా

డెల్టా వేరియంట్ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో రానున్న నాలుగు వారాల్లో ఆసుపత్రులలో చేరికలు మరణాలు పెరుగుతాయని సిడిసీ అంచనా వేసింది.

6.ట్విట్టర్ ఇండియా ఎండీ పై వేటు

ట్విట్టర్ ఇండియా ఎండిగా ఉన్న మనీష్ మహేశ్వరిని ఆ సంస్థ అమెరికాకు బదిలీ చేసింది.

7.ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ పై నిషేదం

ఈస్ట్ ఆఫ్రికా దేశమైన జాంబియాలో ఈనెల 12వ తేదీన  దేశ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగిన మరుసటి రోజు నుంచి ఓట్ల లెక్కింపు ముగిసే 72 గంటల వరకు ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ పై నిషేదం విధించింది.

8.రెండు ముక్కలైన షిప్

Advertisement

జపాన్ లోని అమోరి ప్రీ ఫెక్చర్ హచినొహె పోర్ట్ సమీపంలో చమురు రవాణా నౌక రెండు ముక్కలైంది.దీంతో పెద్ద ఎత్తున ఉత్సవములు సముద్రంలో కలిసిపోయింది.

9.ఇంగ్లాండ్ లో కాల్పులు ఆరుగురు మృతి

నైరుతి ఇంగ్లాండ్ లోని ప్లైన్ మౌత్ నగరంలో శుక్రవారం ఉదయం కాల్పుల కలకలం చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఆరుగురు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు.

10.అమ్మకానికి రీబాక్

ప్రముఖ స్పోర్ట్స్ వేర్ ఉత్పత్తుల సంస్థ రీబాక్ అమ్మకానికి వచ్చింది.ఈ బ్రాండ్ ని 2.5 బిలియన్ డాలర్లకు అతెంటిక్ బ్రాండ్స్ గ్రూప్ సొంతం చేసుకుంది.  .

Advertisement

తాజా వార్తలు