తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్- Telugu NRI America News

1.ఎన్నారైలకు టిడిపి ఎమ్మెల్యే వినతి

అమెరికాలోని బోస్టన్ నగరంలో రెండు రోజుల పాటు జరిగే తెలుగుదేశం మహానాడు శుక్రవారం రాత్రి ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.టిడిపి మళ్లీ అధికారంలోకి వచ్చేలా ఎన్నారైలు తగిన సహకారం అందించాలని ఆయన కోరారు. 

2.కువైట్ లో భారత ప్రవాసుడు మృతి

  భారత్ కు చెందిన కెఎస్ సునీల్ కుమార్ (45) అనే కేరళకు చెందిన వ్యక్తి అనారోగ్యంతో కువైట్ లో మృతి చెందాడు.

ఇతడు భావన్స్ కువైత్ అనే ఇండియన్ స్కూల్ లో నాన్ టీచింగ్ స్టాఫ్ గా పని చేస్తున్నాడు  

3.ఇండియన్ కాన్సులెట్ కీలక ప్రకటన

  ఇండియన్ కాన్సులెట్ పాస్ పోర్ట్ సర్వీసుల విషయమై కీలక ప్రకటన చేసింది.ఈ నెల 22,29 తేదీల్లో వరుసగా రెండు ఆదివారాలు వాక్-ఇన్ పాస్ పోర్ట్ సేవా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. 

4.బ్రిటన్ కుబేరుల జాబితాలో భారత సంతతి వ్యక్తులు

 

భారత సంతతికి చెందిన బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్, ఆయన భార్య అక్షిత మూర్తి బ్రిటన్ అపర కుబేరుల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.సండే టైమ్స్ పత్రిక బ్రిటన్ రిచ్ లిస్ట్ పేరిట 250 మంది సంపన్నుల జాబితా విడుదల చేయగా .అందులో రిషి సునక్ దంపతులకు 222 వ స్థానం దక్కింది. 

5.పెరుగుతున్న మంకీ ఫాక్స్.డబ్ల్యు హెచ్ వో అత్యవసర సమావేశం

  మంకీ ఫాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ వో దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. 

6.11 దేశాల్లో 80 మంకీ ఫాక్స్ కేసులు

 

Advertisement

ప్రపంచవ్యాప్తంగా మంకీ ఫాక్స్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.బ్రిటన్ లో తొలి మంకీ ఫాక్స్ కేసు నమోదు అయ్యింది.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 11 దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఉంది.ఇప్పటి వరకు 80కి పైగా కేసులు నమోదయ్యాయి. 

7.నార్త్ కొరియా కు బైడన్ ఆఫర్

  ఉత్తర కొరియా కరోనా కేసులు తీవ్రతరం అవుతుండడం తో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ కఠిన ఆంక్షలు విధించారు.

దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కీలక ప్రకటన చేశారు.ఆ దేశంలోని ప్యోం గ్యాంగ్ తో పాటు, చైనాకు కరోనా వాక్సిన్ లు అందజేస్తామని బైడన్ ప్రకటించారు.దీనిపై ఉత్తరకొరియా నుంచి ఎటువంటి స్పందన రాలేదు. 

8.ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా ఆంతోని ఆల్బనీస్

 

ఆస్ట్రేలియా లో జరిగిన ఎన్నికలలో ప్రతిపక్ష లేబర్ పార్టీ స్కాట్ మెరిసన్ ప్రభుత్వాన్ని ఓడించింది.దీంతో ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా లేబర్ పార్టీ నాయకుడు ఆంథోనీ అల్భనీస్ బాధ్యతలు చేపట్టనున్నారు. 

9.యుద్ధం ముగిసిందని ప్రకటించిన పుతిన్ సేన

  ఉక్రెయిన్ లోని మరియా పోల్ విషయంలో రష్యా కీలక ప్రకటన చేసింది.మరియా పోల్ ను స్వాధీనం చేసుకునేందుకు  కొన్ని నెలల పాటు సాగిన యుద్ధం ముగిసిందని రష్యా సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఇగర్ కొనషెంకొవ్ ప్రకటించారు. 

10.శ్రీలంకకు భారత్ సాయం

 

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్ సాయం అందిస్తోంది .తాజాగా శ్రీలంక కు మరో 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ ను పంపింది.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు