1.ఎన్నారై టిడిపి యూఎస్ఏ కోఆర్డినేటర్ గా జయరాం కోమటి
ఎన్నారై తెలుగుదేశం పార్టీ యూఎస్ఏ కోఆర్డినేటర్ గా జయరాం కోమటి ని నియమిస్తున్నట్లు టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు ప్రకటించారు.
2.చైనాలో ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన
చైనా లోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది.అత్యవసర సమయంలో భారత పౌరులు తమను ఫోన్ ద్వారా సంప్రదించాలని సూచించింది.అత్యవసర సేవల కోసం 8618930314575 / 18317160736 నంబర్ల ను సంప్రదించాలని కోరింది.
3.కెనడాలో భారతీయుడి హత్య .అనుమానితుడి అరెస్ట్
కెనడా లో భారత విద్యార్థి హత్యకు గురయ్యాడు.కార్తీక్ వాసుదేవన్ అనే 21 ఏళ్ల యువకుడు డ్యూటీకి వెళ్తున్న సమయంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో కార్తీక్ మృతి చెందాడు ఈ ఘటన లో ఓ అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
4.కువైట్ లో భారత ఎంబసీ రెండు రోజుల మూత
కువైట్ లోని భారత రాయబార కార్యాలయం గురువారం , ఆదివారం రెండు రోజుల పాటు మూత పడనుంది.అయితే ఎమర్జెన్సీ కాన్సులర్ మాత్రం యధావిధిగా నడుస్తాయని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
5.అమెరికాలో కాల్పులు…16 మందికి గాయాలు
న్యూయార్క్ లోని బ్రూక్లిన్ స్ట్రీట్ లో కాల్పులు కలకలం సృష్టించాయి.ఈ ఘటనలో 16 మంది వరకు గాయాలపాలైనట్టు పోలీసులు తెలిపారు.నిందుతుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
6.భారత్ ఓ చెత్త దేశం అమెరికా ప్రొఫెసర్ సంచలన వ్యాఖ్యలు
భారత్ ఓ చెత్త దేశం అంటూ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒమీ మ్యాక్స్ అనే లా ప్రొఫెసర్ విమర్శించారు.
7.అమెరికాలో ఘనంగా సీతారాముల కళ్యాణం
అమెరికాలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు.గత ఆరు సంవత్సరాలుగా లాస్ ఏంజెల్స్ పరిసర ప్రాంతాల్లో ని ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
8.జీ 7 సదస్సుకు భారత్ ను ఆహ్వానిస్తాం : జర్మనీ
జీ 7 సదస్సుకు భారత్ ను ఆహ్వానిస్తాం అని జర్మనీ ప్రకటించింది.
9.ఉక్రెయిన్ పై రష్యా యుద్దాన్ని స్టడీ చేస్తున్న భారత ఆర్మీ
ఉక్రెయిన్ పై రష్యా యుద్దాన్ని భారత ఆర్మీ అధ్యయనం చేస్తోంది.ఈ వార్ పై వ్యూహాత్మక పాఠాలు నేర్చుకోవడం పై దృష్టి పెట్టింది.
10.1026 మంది ఉక్రెయిన్ సైనికుల లొంగుబాటు
మరియాపోల్ లో 1026 మంది సైనికులు లొంగిపోయినట్లు రష్యా ప్రకటించింది.