నాకు ఇంగ్లీష్ మాట్లాడటం తనే నేర్పింది.. యష్ షాకింగ్ కామెంట్స్!

కేజిఎఫ్ సినిమా ద్వారా జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు పొందిన నటుడు యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కేజిఎఫ్ సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

 My Wife Taught Me To Speak English Yash Shocking Comments Details, Hero Yash, K-TeluguStop.com

ఇదిలా ఉండగా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన కేజిఎఫ్ చిత్రానికి సీక్వెల్ చిత్రంగా కేజిఎఫ్2 మరో 24 గంటలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ పోస్టులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యశ్ తన గురించి తన భార్య గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా యశ్ మాట్లాడుతూ.

తన భార్య రాధికా సపోర్ట్ తనకు ఎంతగానో ఉందని వెల్లడించారు.

Telugu English, Yash, Kgf Chapter, Kollywood, Prasanth Neel, Radhika, Yash Inter

రాధిక ఫ్యామిలీ, పిల్లలను ఎంతో చక్కగా చూసుకోవడమే కాకుండా నాకు చాలా సపోర్ట్ గా ఉంటుందని ఆయన తెలియజేశారు.నేను పక్క లోకల్, నాకు కన్నడ భాష తప్ప మరే ఇతర భాషలు వచ్చేవి కాదు.నేను ఎలా మాట్లాడాలో రాధిక నాకు నేర్పించింది.

ముఖ్యంగా ఇంగ్లీష్ మాట్లాడటం కూడా రాధికానే నాకు నేర్పించిందని ఈ సందర్భంగా తన భార్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం నేను ఇలా ఉన్నాను అంటే కేవలం తన భార్య రాధిక సపోర్ట్ ఉండటం వల్లే అంటూ తన భార్య గురించి యశ్ ప్రశంసల వర్షం కురిపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube