తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.అమెరికాలో భారతీయుల కి కీలక పదవి

బెంగళూరుకు చెందిన భారతీయ అమెరికన్ మహిళ న్యాయవాది జవహర్ కుదేకల్లు (32) కు కీలక పదవి దక్కింది.

  న్యూయార్క్ సిటీ బార్ అంతర్జాతీయ మానవ హక్కుల కమిటీ చైర్ పర్సన్ గా రమ్య నియమితులయ్యారు . 

2.యూఏఈ నివాసితులకు 3 నిమిషాల్లో బ్యాంక్ ఖాతా

  యూఏఈ నివాసితులు ఇకపై బ్యాంకుకు వెళ్లకుండా కేవలం మూడు నిమిషాలు ఇంటి నుంచి బ్యాంకు ఖాతా తెరిచే అవకాశాన్ని మశ్రేక్ బ్యాంక్ తీసుకు వస్తోంది.దీనికోసం ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించనుంది. 

3.మహిళల విషయంలో కువైట్ కీలక నిర్ణయం

  గర్ల్స్ దేశం కువైట్ లో మహిళల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.ఇక పై వారికి కూడా ఆర్మీ లో పనిచేసేందుకు అవకాశం కల్పించింది. 

4.విమాన సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేత

  ఈ నెల 18 నుంచి పూర్తి సామర్థ్యం మేర దేశీయ విమాన సర్వీసులను నడుపుకునేందుకు కేంద్రం అనుమతించింది.కరోనా నేపథ్యంలో దేశీయ విమాన సర్వీసులపై విధించిన పరిమితిని ఎత్తి వేస్తున్నట్టు కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది. 

5.అమెరికాలో విమాన ప్రమాదం భారత సంతతి వైద్యుడి దుర్మరణం

  అమెరికా లో సంభవించిన విమాన ప్రమాదంలో భారత సంతతికి చెందిన వైద్యుడు సుగతా దాస్ చనిపోయారు.ఈయన బెంగాల్ కు చెందినవారు. 

6.డల్లాస్ టిపాడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

  తెలుగు పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్స్ డల్లాస్ ఆధ్వర్యంలో టెక్సాస్ లోని డల్లాస్ లో బతుకమ్మ వేడుకలను వైభవం గా నిర్వహించారు. 

7. తాకా నూతన కార్యవర్గం ఎన్నిక

Advertisement

  తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా ) 2021 - 23 కాలానికి నూతన కార్యవర్గం ను అక్టోబర్ 3 న బ్రాంప్టన్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

8.అరుణాచల్ కు భారత నేతలను రవొద్దన్న చైనా .భారత్ ఆగ్రహం

  భారత్ పై చైనా మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది.చాలా కాలంగా అరుణా చల్ ప్రదేశ్ తమదేనని వాదిస్తున్న చైనా, తాజాగా భారత్ నేతలు ఈ భూభాగంలో పర్యటిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించింది. 

9.పాక్ ప్రభుత్వం సైన్యం మధ్య విబేధాలు

  పాకిస్థాన్ ప్రభుత్వానికి సైన్యానికి మధ్య చాలా కాలంగా విభేదాలు వస్తూనే ఉన్నాయి.దీనికి కారణం పాక్ సైన్యం ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ హమీద్ ను బదిలీ చేయడమే .  ఈ బదిలీపై అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహంగా ఉన్నారు.ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున ఈ బదిలీ ఉత్తర్వులు అమలు చేయకపోవడం పై పాకిస్థాన్ ఆర్మీ ఆగ్రహంగా ఉంది. 

10.మయన్మార్ లో ఘర్షణ .30 మంది సైనికుల మృతి

  మయిన్మార్ సాగింగ్ ప్రాంతంలో మయన్మార్ మిలటరీ, తిరుగుబాటు గ్రూపుల మధ్య ఘర్షణలు జరిగాయి.ఈ ఘర్షణలో 30 మంది సైనికులు మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు