తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ - Telugu NRI America News

1.ఉక్రెయిన్ ప్రధానికి భారత ప్రధాని సూచన

రష్యా ఉక్రెయిన్ వివాదంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు .

ఈ మేరకు ప్రధాని ఎలేన్ స్కి కి కీలక సూచన చేశారు.చర్చల ద్వారా రష్యాతో ఏర్పడిన  సమస్యని పరిష్కరించుకోవాలని సూచించారు.

2.రాయబారుల పై పాక్ ప్రధాని ఆగ్రహం

ఉక్రెయిన్ లో రష్యా యుద్దాన్ని ఖండించాలని పాకిస్తాన్ ను కోరిన ఇస్లామాబాద్ కు చెందిన పాశ్చాత్య దేశాల రాయబారులపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  పాక్ మీకు ఏమన్నా బానిస అనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు.

3.రష్యా ప్రధానికి భారత ప్రధాని సూచన

రష్యా ప్రధాని పుతిన్ కు భారత ప్రధాని నరేంద్రమోదీ కీలక సూచన చేశారు.ఉక్రెయిన్ ప్రధాని జెలైన్ స్కి తో మీరే మాట్లాడి వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు.

4.రష్యా లో టిక్ టాక్ , నెటి ఫ్లిక్స్  బంద్

రష్యా లో నెటి ఫ్లిక్స్ , టిక్ టాక్ సర్వీసులను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి.

5.పాక్ డ్రోన్ ను కూల్చివేసిన భారత్

భారత సరిహద్దుల్లో కనిపించిన పాకిస్థాన్ కు  చెందిన డ్రోన్ ను భారత ఆర్మీ కూల్చి వేసింది.

6.శత్రువుల జాబితా విడుదల చేసిన రష్యా

తమ శత్రు దేశాల జాబితాను రష్యా అధ్యక్షుడు పుతిన్ విడుదల చేశారు.బ్రిటన్ తో సహా అందులో 31 దేశాలు ఉన్నాయి.

7.అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ లో పాల్గొనేందుకు రష్యా నిరాకరణ

ఉక్రెయిన్ పై యుద్దానికి దిగిన రష్యా , అంతర్జాతీయ న్యాయస్థానం లో జరిగే విచారణ లో పాల్గొనేందుకు నిరాకరించింది.

8.భారత్ చైనా సంబంధాల పై చైనా వ్యాఖ్యలు

భారత్ చైనాలు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్లాలని చైనా విదేశాంగ శాఖ మంత్రి  వాంగ్ అన్నారు.

9.రొమేనియా నుంచి ముగిసిన ఆపరేషన్ గంగ

Advertisement

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగ కార్యక్రమం ద్వారా రొమేనియా నుంచి 155 మంది తో చివరి విమానం ఢిల్లీ బయలుదేరింది.

10.షేర్ వార్న్ ది సహజ మరణమే : థాయిలాండ్

ప్రముఖ ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేర్ వార్న్ మరణం పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని థాయిలాండ్ పోలీసులు ప్రకటించారు.

'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 
Advertisement

తాజా వార్తలు