తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ - Telugu NRI America News

1.పౌరసత్వాన్ని వదులుకున్న 6 లక్షల మంది భారతీయులు

గత ఐదేళ్లలో 6 లక్షల మంది భారతీయులు తమ పౌర సత్వాన్ని వదులుకున్నట్టు కేంద్ర మంత్రి నిత్యానందన్ రాయ్ ప్రకటించారు.

2.ట్విట్టర్ సీఈవో గా పరాగ్ అగర్వాల్

ట్విట్టర్ సీఈవో గా భారత్ కు చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు.

3.మాదక ద్రవ్యాల చట్టాన్ని సవరించిన యూఏఈ

మారక ద్రవ్యాల చట్టానికి యూఏఈ సవరణలు చేపట్టింది.

గంజాయి లోని ప్రధాన మత్తు పదార్థం అయిన టీ సీ హెచ్ ను తమ దేశంలోకి తీసుకువచ్చే వారికి విధించే శిక్షను సవరించింది.తొలిసారిగా మాదకద్రవ్యాలు తీసుకొస్తే పట్టుబడే వారికి శిక్ష ఉండదని,  ఆ పదార్థాలను అధికారులు ధ్వంసం చేస్తారని కొత్త చట్టంలో పేర్కొంది.

4.ప్రవాసులకు కొత్త ఇన్సూరెన్స్ పాలసీ : కువైట్

Advertisement

ప్రవాసుల కొత్త ఇన్సూరెన్స్ పాలసీ పై కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది.దీని కోసం ఇక పై వలసదారులు ప్రతి ఏటా 130 కువైట్ దినార్లు చెల్లించాల్సి ఉంటుంది.

5.ఆఫ్రికా కు వంద కోట్ల టీకాలు : చైనా

ఆఫ్రికన్ నేతలతో సోమవారం జరిగిన సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.కొత్త కరోనా వేరియంట్ తో బాధపడుతున్న ఆఫ్రికా కు వందకోట్ల కొవిడ్ టీకా దోసులతో పాటు , 8 లక్షల ఉద్యోగాల రూప కల్పన , రుణాల మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది.

6.ఒమై క్రాన్ వైరస్ కు టీకా పై రష్యా కీలక  ప్రకటన

ఒమై క్రాన్ వైరస్ కు టీకా పై రష్యా కీలక  ప్రకటన చేసింది.స్పుత్నిక్ టీకాకు ఒమై క్రాన్ వైరస్ ను కట్టడి చేసే సామర్థ్యం ఉందని రష్యా ప్రకటించింది.7.జపాన్ లో ఒమైక్రాన్ కేసు జపాన్ లో ఒమైక్రాన్ తొలి కేసు నమోదు అయ్యింది.

8.నాట్స్ ఆధ్వర్యంలో బాలల సంబరాలు

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో అమెరికాలో బాలల సంబరాలు నిర్వహించనున్నారు.2021 డిసెంబర్ 4 న ఈ బాలల సంబరాలు నిర్వహించనున్నారు.

9.ఖైదీలను విడుదల చేసిన తాలిబన్ లు

ఆఫ్ఘనిస్తాన్ లోని జైళ్లలో ఉన్న దాదాపు 210 మంది ఖైదీలను తాలిబన్ ప్రభుత్వం విడుదల చేసింది.

10.మళ్లీ స్వీడన్ పీఠం పై అండర్సన్

మళ్లీ స్వీడన్ ప్రధాన మంత్రిగా మహిళా నేత మగ్జలీన అండర్సన్ నియమితులు అయ్యారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు