తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.భారత్ పై ఆంక్షలు తగ్గించిన అమెరికా

  కరోనా వైరస్ ప్రభావం తో భారత్ పై విధించిన ఆంక్షలను అమెరికా తగ్గించింది.

లెవెల్ 4 నుంచి లెవల్ 2 లో కి చేర్చింది. 

2.తాలిబన్లకు చైనా హెచ్చరిక

   తాలిబన్లను చైనా హెచ్చరించింది.ఆఫ్ఘనిస్తాన్ ను మరోసారి ఉగ్రవాదులు అడ్డాగా మార్చవద్దని హెచ్చరించింది. 

3.న్యూజిలాండ్ లో లాక్ డౌన్

  న్యూజిలాండ్ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది.ఆ దేశంలోని ఆక్లాండ్ లో నమోదైన ఒక్క కరోనా కేసు కోసం ఈ నిర్ణయం తీసుకుంది. 

4.తాలిబన్లకు సాయం నిలిపివేత

   ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు చేస్తున్న సాయాన్ని ఇకపై నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. 

5.సుడోకు సృష్టికర్త మృతి

  పాపులర్ పజిల్ గేమ్ సుడోకు సృష్టికర్త మాకీ కాజి (69) అనారోగ్యంతో కన్నుమూశారు. 

6.అమెరికాలో నీళ్ల కష్టాలు

  అమెరికా ల నీటి కష్టాలు ఇబ్బందికరంగా మారాయి దాదాపు సాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయి.లేక్ మీడ్ జలాశయంలో నీరు అడుగంటి పోయిందని అమెరికా అంగీకరించింది. 

7.తాలిబన్లకు ఫేస్ బుక్ షాక్

Advertisement

  సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తాలిబన్ల కు గట్టి షాక్ ఇచ్చింది.ఫేస్ బుక్, వాట్సాప్ , ఇన్ స్టా గ్రామ్ యాప్ లు వినియోగించకుండా తాలిబన్లపై ఫేస్బుక్ నిషేధం విధించింది. 

8.అఫ్గాన్ ప్రజలను ఆదుకోండి : మలాలా

  ఆఫ్ఘనిస్తాన్ మహిళలు బాలికల రక్షణ ప్రమాదంలో పడిందని వెంటనే వారిని ఆదుకొని తాలిబన్లపై తగిన చర్యలు తీసుకోవాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాహీ కోరారు. 

9.రాజస్తాన్ లోని భారత ప్రవాసుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్

  ఆఫ్గాన్ లో చిక్కుకున్న భారత ప్రవాసుల కోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆఫ్గాన్ లో ప్రత్యేక సెల్ హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేసింది.+919717785379,  MEAHelpdeskindia@gmail.com అనే మెయిల్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. 

10.కాబూల్ గురుద్వారా లో 320 మంది భారతీయులు

  ఆఫ్ఘాన్ తాలిబన్ల వర్షం కావడంతో కాబూల్ లోని మూడు వందల ఇరవై మందికి పైగా భారతీయులు అక్కడ కార్డే పర్వాన్ గురుద్వారా లో తలదాచుకున్నారు.

వారిలో 270 మందికిపైగా సిక్కులు, 50 మందికి పైగా హిందువులు ఉన్నట్లు తెలుస్తోంది.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు