అన్నీ ఉన్నా ఈ అమ్మడికి ఎందుకో సినిమా అవకాశాలు రావట్లేదు....

తెలుగులో ప్రముఖ సీనియర్ హీరో శ్రీకాంత్ హీరోగా నటించిన "మాయా జాలం" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన ముంబై ముద్దుగుమ్మ "పూనమ్ కౌర్" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఈ అమ్మడు వచ్చీరావడంతోనే పర్వాలేదనిపించడంతో సినిమా అవకాశాలు బాగానే తలుపు తట్టాయి.

ఈ క్రమంలో పూనమ్ కౌర్ కి తమిళం, కన్నడ, మలయాళం, తదితర భాషలలో సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడంతో కొంతమేర తెలుగు సినిమా పరిశ్రమని పక్కన పెట్టింది.దీనికి తోడు ఈ మధ్య అనుకోకుండా వ్యక్తిగత కారణాల వల్ల 2 సంవత్సరాల పాటు సినిమా పరిశ్రమకి దూరం గా ఉంది.

దాంతో ఈ గ్యాప్ లో ఈ అమ్మడికి సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.ఆ తర్వాత మళ్లీ అడపాదడపా చిత్రాల్లో నటించడం మొదలు పెట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో హిట్లను మాత్రం అందుకోలేకపోయింది.

అయితే పూనమ్ కౌర్ కి నటనా ప్రతిభ పుష్కలంగా ఉన్నప్పటికీ కథల విషయంలో మరియు పాత్రల విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడంతో కొంతమేర అవకాశాలు తగ్గిపోయాయి.దీనికితోడు అప్పుడప్పుడు పూనమ్ కౌర్ టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరో పై సంచలన వ్యాఖ్యలు చేయడం మరియు రాజకీయ పరంగా విమర్శించడం వంటివి చేయడం వంటి వాటి వల్ల కూడా ఈ అమ్మడి సినీ కెరియర్ దెబ్బతిన్నట్లు సమచారం.

Advertisement

అయితే తెలుగులో ఆమధ్య పూనమ్ కౌర్ "నెక్స్ట్ ఏంటి" అనే చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రల్లో నటించింది.కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

కాగా ప్రస్తుతం పూనమ్ కౌర్   తమిళంలో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న "గెస్ట్" అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు