తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 7,ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.16

సూర్యాస్తమయం:సాయంత్రం 06.04

రాహుకాలం: మ.

04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.07.00 నుంచి 10.00 వరకు

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu Sunday 7 March 2021-తెలు

దుర్ముహూర్తం: మ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu Sunday 7 March 2021

ఈరోజు మీకు బాగుంటుంది.మీరు చేసిన కొన్ని పొరపాట్లను సరిదిద్దుకుంట‌ారు.ఇతరుల వ్యక్తిత్వం గురించి అర్థం చేసుకుంటారు.

విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంది.లాభాలు ఎక్కువగా ఉండటంవల్ల వాహన కొనుగోలు చేస్తారు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

మీరు పనిచేసే స్థానం బదిలీ అయ్యే అవకాశం ఉంది.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు కాస్త ఇబ్బందికరంగా ఉంటారు.కొన్ని ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకుండా ఉండడం వల్ల చికాకు చెందుతారు.ఎక్కువ ఖర్చులు చేయడం వల్ల ధన నష్టాలు ఉంటాయి.

కొన్ని పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

ఈరోజు మీరు ఇతరులకి ఇచ్చే సొమ్మును తీరుస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది.కొన్ని లాభాలు ఏర్పడుతాయి.

ముఖ్యమైన పనులలో మంచి అవకాశాలు వస్తాయి.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

విద్యార్థులు తమ చదువు పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా కాపాడుకోవాలి.

స్నేహితులతో ఆలోచించి మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఎక్కువ ఒత్తిడి అవుతుంది.

సింహం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉండటం వల్ల విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.మీ వ్యక్తిత్వం వల్ల మీ శత్రువులు మిత్రులు అవుతారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.విద్యార్థులు తమ సమయాన్ని వృథా చేయకూడదు.

కన్య:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవడం వల్ల ప్రశంసలు అందుతాయి.

తులా:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

విద్యార్థులకు చదువుపట్ల అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు ఇతరులకు ఇచ్చే సొమ్ము కాస్త ఆలస్యం అవుతుంది.తోబుట్టువులతో అనవసరంగా వాదనలకు దిగకండి.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలుగుతుంది.

కొన్ని పనులలో జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

మకరం:

ఈరోజు మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు.ఇతరుల నుండి నీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

విలువైన సమయాన్ని వృథా చేస్తారు.ఒకరిని నమ్మి మోసపోతారు.

ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కుంభం:

ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనారోగ్య సమస్య ఏర్పడుతుంది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

మీనం:

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల ఆర్థికంగా నష్టాన్ని ఎదుర్కొంటారు.ఇతరులకు మీరిచ్చే సొమ్ము ఆలస్యం అవుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

తాజా వార్తలు