తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 16, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.33

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

19

రాహుకాలం మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు ఉ.06.00 నుంచి 11.00 వరకు

Advertisement

దుర్ముహూర్తం మ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గుర్తింపు అందుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.కుటుంబ సభ్యుల తో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

Advertisement

వృషభం:

ఈ రోజు ఏ పనులు చేసిన ఓపికతో ఉండాలి.కొన్ని సంతృప్తికరమైన లాభాలు అందుకుంటారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం దక్కుతుంది.

ఇతరుల నుండి ప్రశంసలు పొందుతారు.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

వ్యాపారస్తులు పనులు వాయిదా వేసుకోవాలి.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి.సొంత నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.ఇతరులతో అనవసరంగా వాదనలకు దిగకండి.

దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులెదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కాస్త మనశ్శాంతి ఉంటుంది.

సింహం:

ఈరోజు మీరు అనుకున్న పనులను పూర్తిచేస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఇతరులతో కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

కన్య:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.

ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది.

మీరు పనిచేసే చోట పని ఒత్తిడి గా ఉంటుంది.

తులా:

ఈరోజు మీరు పెద్దల నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఈరోజు మీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది.

కొన్ని ముఖ్యమైన పనులలో ఆలస్యం అవుతాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.సంతానం గురించి ఆలోచన చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.మనశ్శాంతి కోసం కాస్త సమయాన్ని కాలక్షేపం చేయాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కొన్ని కార్యక్రమాల్లో హాజరు కాకపోవడం మంచిది.మీరు కొన్ని పనులను వాయిదా వేసుకుంటారు.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

సంతానం పట్ల పెద్దల నిర్ణయాలు తీసుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఎక్కువ ఖర్చులు చేయకూడదు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

ఇతరులతో ఆర్థికంగా సహాయం పొందుతారు.వ్యాపారస్తులకు కష్టం తో కూడిన లాభం ఉంటుంది.

మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.

కుంభం:

ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.అనవసరమైన విషయాలను పట్టించుకోకూడదు.

మీనం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా కొన్ని ఖర్చులు ఉంటాయి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు.

ఇంట్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.ఇతరులతో వాదనలకు దిగకండి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తాజా వార్తలు