తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 3, బుధవారం, 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.59

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

45

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 11.00 మ2.00 సా.4.09వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.11.57 నుంచి 12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వారితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.

అనవసరమైన విషయాలలో తల తీర్చకుండా ఉండడమే మంచిది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
ఈ రాశుల వారితో పోటీ పడడం చాలా కష్టం..!

వృషభం:

Advertisement

ఈరోజు మీరు గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది.భూమి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.

పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించె సోమత మీలో ఉంటుంది.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

సింహం:

ఈరోజు వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతి అందుతుంది.ఇంటి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

కన్య:

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీ పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.ఈరోజు మీరు కొన్ని బాధ్యతలు కూడా పొందుతారు సమాజంలో గౌర ప్రతిష్టలు పొందుతారు.

తులా:

ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకండి.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీరు చేసే ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు పడతారు.

వృశ్చికం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయా అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.

తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

ధనస్సు:

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి యాత్రలకు వెళ్తారు.విద్యార్థులు చదువుపై కాకుండా ఇతర వాటిపై కూడా దృష్టి పెడతారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాటుల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.

మకరం:

ఈరోజు మీరు మీ మనసులో ఉన్న మాట ఇతరులతో పంచుకోండి.వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.ఈరోజుతో మీ కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి.

ఇంటికి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

కుంభం:

ఈరోజు మీరు గతంలో నిలిపివేయబడ్డ పనులు ఈరోజు పూర్తి చేస్తారు.ఇరుగు పొరుగు వారితో వాతనలకు దిగే అవకాశం ఉంది.ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మీనం:

ఈరోజు మీరు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఈరోజు ఏ పని మొదలు పెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.మీలో బలహీనత ఈరోజు ఎక్కువగా ఉంటుంది.

మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.

తాజా వార్తలు