తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 23, శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

12

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.30 నుంచి 10.30 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు శుభం జరుగుతుంది.ఆర్థికంగా లాభం ఉంటుంది.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

ముఖ్యంగా మీరు మీ పనులలో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది.పరిచయం లేని వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండాలి.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

Advertisement

వృషభం:

ఈరోజు ఆర్థికంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.మీరు కష్టపడి పనిచేయడం వల్ల ఫలితం అందుతుంది.స్నేహితులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు మీ ఆలోచనలను మారుస్తాయి.వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది.

సమయాన్ని వృథా చేయకండి.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా బాగుంది.మీ ఆలోచనల వల్ల గొప్ప స్థాయికి వెళ్తారు.వీలైనంత వరకు ఎటువంటి గొడవలకు వెళ్లకుండా ఉండాలి.

కొన్ని ముఖ్యమైన పనులలో మీదే విజయం ఉంటుంది.బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు.

ఉద్యోగ అవకాశం ఉంది.

కర్కాటకం:

ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభం ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొంటారు.

ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.

మీ ఆలోచన విధానం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.

సింహం:

ఈరోజు మీరు ఎంత కష్టపడినా మీ కష్టానికి ఫలితం దక్కదు.దీనివల్ల నిరాశ చెందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం.మీ స్నేహితుల నుండి సహాయం పొందుతారు.

మీరు పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.తోబుట్టువులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడటం వల్ల ముఖ్య విషయాలు తెలుసుకుంటారు.ఈరోజు వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.

ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

తులా:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు సక్రమంగా పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభం ఉంటుంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సొంతం చేసుకుంటారు.

వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థిక విషయంలో నిరాశ పడతారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు చేజారిపోయే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

సమయం అనుకూలంగా ఉన్నప్పుడు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించాలి.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.

ధనస్సు:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.స్థల కొనుగోలు గురించి ఆలోచన చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మీకు మంచి గౌరవం దక్కుతుంది.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.మీ స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సరైన సమయంలో పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.మీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోకుండా ఇతరులు ఇబ్బంది పెడతారు.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు పనులు త్వరగా పూర్తి చేస్తారు.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకున్న పనులు పూర్తి చేయాలనే పట్టుదలతో ఉండగా వాయిదా పడతాయి.మీపై బాధ్యతలు ఎక్కువగా పడే అవకాశం ఉంది.

మనశ్శాంతి కోల్పోవడం వల్ల కాస్త సమయాన్ని కాలక్షేపం చేయాలి.కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా నిరుత్సాహ పడుతారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

తొందరపడి ఆవేశం పెంచుకోకూడదు.మీ బంధువుల నుండి ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట సమస్యలు ఎదురవుతాయి.

తాజా వార్తలు