తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం ఛత్రపతి సినిమాలో విలన్ గీసిన గీత ప్రభాస్ దాటుతుండగా “అరే వద్దురా వద్దురా” అంటూ ఆపేటువంటి సన్నివేశం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటుంది.అయితే ఈ సన్నివేశంలో నటించినటువంటి చత్రపతి శేఖర్ కూడా ప్రేక్షకులకు బాగానే గుర్తుంటాడు.
అయితే తాజాగా శేఖర్ ఓ ప్రముఖ యూట్యూబ్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా చత్రపతి సినిమా గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
చత్రపతి సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్ షూటింగ్ జరుగుతున్న సమయంలో తాను అనుకోకుండా నీటిలోకి జారి పడ్డానని ఆ సమయంలో ప్రభాస్ చాకచక్యంగా తనను బయటకు లాగి ప్రాణాలు కాపాడాడని తెలిపాడు.అలాగే ప్రభాస్ షూటింగ్ జరిగే సమయంలో అందరి తోనూ చాలా సరదాగా ఉంటాడని, ఎవరినీ నొప్పించే పనులు గానీ, నొప్పించే మాటలు గానీ మాట్లాడడని కూడా చెప్పుకొచ్చాడు.
అలాగే పని మీద కూడా ఎప్పుడూ శ్రద్ధ వహిస్తాడని అందువల్లే బాహుబలి లాంటి చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుని దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని తెలిపాడు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కేకె రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న జాన్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
అలాగే ఇటీవలే అలనాటి అందాలతార మహానటి సావిత్రి జీవిత గాథను కళ్ళకు కట్టినట్లుగా తెరకెక్కించిన టాలీవుడ్ యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఈ చిత్రం సైన్స్ ఫ్రిక్షన్ జోనర్లో ఉండబోతున్నట్లు సమాచారం.
అలాగే ఈ చిత్రాన్ని దాదాపుగా 5 భాషల్లో తెరక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ప్రభాస్ వరుస అవకాశాలతో దూసుకు పోతున్నాడు.