టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు ఆగష్టు నెలలో పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, మరి కొందరు స్టార్ హీరోలు ఈ నెలలోనే పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటూ ఉండటం గమనార్హం.
ఆగష్టు నెల 1వ తేదీన తాప్సీ హీరో హరీష్ పుట్టినరోజు జరుపుకోగా ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.
ఆగష్టు నెల 3వ తేదీన షామిలి, వాణిశ్రీ పుట్టినరోజు కాగా ఆగష్టు 4వ తేదీన అర్భాజ్ ఖాన్, మాళవిక మోహనన్, ఘట్టమనేని ఆదిశేషగిరి రావు పుట్టినరోజు కావడం గమనార్హం.ఆగష్టు 5వ తేదీన జెనీలియా, అనన్య నాగళ్ల, కాజోల్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.ఆగష్టు 6న ధన్య బాలకృష్ణ, ఆగష్టు 7వ తేదీన సచిన్ జోషి, కాల భైరవ, ఆగష్టు 8వ తేదీన ఫహద్ ఫాజిల్, ఆగష్టు 9వ తేదీన మహేష్ బాబు, హన్సిక పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
ఆగష్టు 12వ తేదీన సాయేషా సైగల్, ఆగష్టు 13వ తేదీన శ్రీదేవి జయంతి కాగా ఆగష్టు 15వ తేదీన శ్రీహరి, అర్జున్, సుహాసిని మణిరత్నం పుట్టినరోజు కావడం గమనార్హం.ఆగష్టు 16న మనీషా కోయిరాల పుట్టినరోజు కాగా ఆగష్టు 17వ తేదీన
నిధి అగర్వాల్, డైరెక్టర్ శంకర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు.ఆగష్టు 21వ తేదీన రాధిక, భూమిక పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
ఆగష్టు 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు కాగా ఆగష్టు 25వ తేదీన విజయకాంత్ పుట్టినరోజు కావడం గమనార్హం.ఆగష్టు 28వ తేదీన సుమన్ పుట్టినరోజు కాగా ఆగష్టు 29వ తేదీన నాగార్జున, విశాల్ పుట్టినరోజు జరుపుకోనున్నారు.ఆగష్టు 31వ తేదీన మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ పుట్టినరోజు కావడం గమనార్హం.
ఆగష్టు నెలలో తమ ఫేవరెట్ హీరోలు పుట్టినరోజు వేడుకను జరుపుకోనుండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు.