తెలుగు బిగ్ బాస్ ( Telugu biggboss )కొత్త సీజన్ విషయంలో గందరగోళ వాతావరణం నెలకొంది.అసలు బిగ్ బాస్ ఈ ఏడాది ఉందా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రతి సంవత్సరం ఈ సమయం వరకు హడావుడి మొదలు అయ్యేది.షో నిర్వాహకుల నుండి లీక్స్ రావడం తో మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగేది.
కంటెస్టెంట్స్ మరియు హోస్ట్ విషయం లో ఈసారి ఎలాంటి పుకార్లు రావడం లేదు.ఎలాంటి వార్తలు రావడం లేదు.
దాంతో అసలు విషయం ఏంటి అనేది అర్థం కాక అంతా కూడా గందరగోళంగా మారింది.బిగ్ బాస్ యొక్క హోస్టింగ్ విషయం లో నాగార్జున ( Nagarjuna )ఆసక్తి గా లేడు.
ఇప్పటికే చాలా సీజన్ లను హోస్ట్ చేసిన నాగ్ ఇక తన వల్ల కాదు అంటూ చెప్పి వెళ్లి పోయాడు అంటూ గత ఏడాది నుండే ప్రచారం జరిగింది.నాగ్ కి బిగ్ బాస్ కి ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగానే ప్రచారం జరుగుతోంది.
ఆ మధ్య ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లు ప్రధానంగా వినిపించాయి.
బాలయ్య పేరు ( Balakrishna )ను కూడా ప్రధానంగా ప్రస్థావించారు.కానీ అంత సీన్ లేదు అన్నట్లుగా నందమూరి కాంపౌండ్ అధికారికంగా ప్రకటించింది.దాంతో బిగ్ బాస్ కొత్త సీజన్ విషయం లో ఏం జరుగుతుంది అనేది తెలియడం లేదు.
బిగ్ బాస్ యొక్క హోస్ట్ కన్ఫర్మ్ అవ్వకుండా కంటెస్టెంట్స్ విషయం లో చర్చలు జరపడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశ్యంతో ఇప్పటి వరకు కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేయలేదు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 అసలు ఉందా లేదా అంటూ అనుమానాలు వస్తున్నాయి.ఒక వేళ ఉంటే ఎప్పటి వరకు క్లారిటీ వస్తుందా అని కూడా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు.