నాగార్జున బిగ్ బాస్ హోస్టింగ్ కు ఎందుకు మళ్లీ ఓకే చెప్పాడో తెలుసా?

టాలీవుడ్ కింగ్‌ నాగార్జున( Nagarjuna ) మరోసారి బిగ్ బాస్‌ హోస్ట్ గా రాబోతున్నాడు.ఇది కన్ఫర్మ్ న్యూస్‌.

 Telugu Bigg Boss Season 7 Nagarjuna Remuneration Details, Bigg Boss, Nagarjuna,-TeluguStop.com

సీజన్‌ 6 ముగింపు సమయంలో నాగార్జున బిగ్ బాస్ కు గుడ్‌ బై చెప్పాడు అంటూ వార్తలు వచ్చాయి.కానీ అది నిజం కాదని తేలిపోయింది.

మధ్యలో నాగార్జున స్థానంలో బాలకృష్ణ.విజయ్ దేవరకొండతో పాటు పలువురు స్టార్స్ తో సంప్రదింపులు జరిపారు అంటూ పుకార్లు షికార్లు చేయడం జరిగింది.

అలాంటి సమయంలో అనూహ్యంగా నాగార్జున బిగ్‌ బాస్ సీజన్ 7 కి( Bigg Boss 7 ) హోస్టింగ్‌ చేయబోతున్నట్లుగా క్లారిటీ రావడంతో అభిమానులతో పాటు బిగ్‌ బాస్ ప్రేక్షకులు సర్‌ ప్రైజ్ అవుతున్నారు.

Telugu Bb, Bigg Boss, Biggboss, Biggboss Telugu, Nagarjuna, Nagarjunabigg, Telug

ఇంతకు నాగార్జునను వారు ఏం చెప్పి ఒప్పించి ఉంటారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది.అంతే కాకుండా నాగార్జున తో షో నిర్వాహకులు ప్రోమో ను కూడా షూట్ చేసిన నేపథ్యం లో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.నాగార్జున కొత్త సినిమా మొదలు కాలేదు.

అంతే కాకుండా కొత్త సినిమాకు ఇంకా సమయం ఉంది అనే వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యం లో బిగ్‌ బాస్‌ హోస్ట్‌ గా చేసేందుకు నాగార్జున గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చి ఉంటాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇక సీజన్ 6 తో పోల్చితే సీజన్‌ 7 కి పారితోషికం దాదాపుగా డబుల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu Bb, Bigg Boss, Biggboss, Biggboss Telugu, Nagarjuna, Nagarjunabigg, Telug

మొత్తానికి నాగార్జున ను బిగ్‌ బాస్‌ సీజన్‌ కు ఒప్పించేందుకు షో నిర్వాహకులు చాలానే కష్టపడ్డారని… అలాగే భారీగానే ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.రికార్డు స్థాయి లో పారితోషికం( Nagarjuna Remuneration ) ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.ఇక గత సీజన్ తో పోల్చితే ఈ సీజన్ మరింత హాట్ హాట్ గా ఉండే విధంగా కూడా ముద్దుగుమ్మలను ఎంపిక చేస్తున్నారు.

వారికి ఇప్పటికే ట్రైనింగ్‌ కూడా మొదలు పెట్టారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.మొత్తానికి ఆహా ఓహో అన్నట్లుగా బిగ్‌ బాస్ సీజన్ 7 ఉండబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube