నాగార్జున బిగ్ బాస్ హోస్టింగ్ కు ఎందుకు మళ్లీ ఓకే చెప్పాడో తెలుసా?

టాలీవుడ్ కింగ్‌ నాగార్జున( Nagarjuna ) మరోసారి బిగ్ బాస్‌ హోస్ట్ గా రాబోతున్నాడు.

ఇది కన్ఫర్మ్ న్యూస్‌.సీజన్‌ 6 ముగింపు సమయంలో నాగార్జున బిగ్ బాస్ కు గుడ్‌ బై చెప్పాడు అంటూ వార్తలు వచ్చాయి.

కానీ అది నిజం కాదని తేలిపోయింది.మధ్యలో నాగార్జున స్థానంలో బాలకృష్ణ.

విజయ్ దేవరకొండతో పాటు పలువురు స్టార్స్ తో సంప్రదింపులు జరిపారు అంటూ పుకార్లు షికార్లు చేయడం జరిగింది.

అలాంటి సమయంలో అనూహ్యంగా నాగార్జున బిగ్‌ బాస్ సీజన్ 7 కి( Bigg Boss 7 ) హోస్టింగ్‌ చేయబోతున్నట్లుగా క్లారిటీ రావడంతో అభిమానులతో పాటు బిగ్‌ బాస్ ప్రేక్షకులు సర్‌ ప్రైజ్ అవుతున్నారు.

"""/" / ఇంతకు నాగార్జునను వారు ఏం చెప్పి ఒప్పించి ఉంటారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

అంతే కాకుండా నాగార్జున తో షో నిర్వాహకులు ప్రోమో ను కూడా షూట్ చేసిన నేపథ్యం లో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

నాగార్జున కొత్త సినిమా మొదలు కాలేదు.అంతే కాకుండా కొత్త సినిమాకు ఇంకా సమయం ఉంది అనే వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యం లో బిగ్‌ బాస్‌ హోస్ట్‌ గా చేసేందుకు నాగార్జున గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చి ఉంటాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇక సీజన్ 6 తో పోల్చితే సీజన్‌ 7 కి పారితోషికం దాదాపుగా డబుల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

"""/" / మొత్తానికి నాగార్జున ను బిగ్‌ బాస్‌ సీజన్‌ కు ఒప్పించేందుకు షో నిర్వాహకులు చాలానే కష్టపడ్డారని.

అలాగే భారీగానే ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.రికార్డు స్థాయి లో పారితోషికం( Nagarjuna Remuneration ) ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.

ఇక గత సీజన్ తో పోల్చితే ఈ సీజన్ మరింత హాట్ హాట్ గా ఉండే విధంగా కూడా ముద్దుగుమ్మలను ఎంపిక చేస్తున్నారు.

వారికి ఇప్పటికే ట్రైనింగ్‌ కూడా మొదలు పెట్టారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.మొత్తానికి ఆహా ఓహో అన్నట్లుగా బిగ్‌ బాస్ సీజన్ 7 ఉండబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వాల్‌మార్ట్‌లోని వస్తువులు నేలపై పడేస్తూ రచ్చ చేసిన బాలిక.. వీడియో చూస్తే షాకే..