తన బ్రా సైజ్ ఎంతో చెప్పాలంటూ తెలుగు యాంకర్ ని అడిగిన నెటిజన్...

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో సెలబ్రిటీలు బాగానే యాక్టివ్ గా ఉంటున్నారు.

ఈ క్రమంలో కొందరు సెలబ్రెటీలు తన అభిమానులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు తమకు సంబంధించిన సినిమా సమాచారాలను మరియు ఇతర సమాచారాన్ని కూడా నెటిజన్లలో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలో కొందరు ఈ సోషల్ మీడియాలను ఉపయోగించుకుని సినీ సెలబ్రిటీలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం మరియు వ్యక్తిగత విషయాలను అడిగి ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తూ సెలబ్రిటీలకు ఇబ్బంది కలిగిస్తున్నారు.అయితే తెలుగులో పలు షోలు ఈవెంట్లలో తన గల గల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ యాంకర్ "నేహా చౌదరి" కి సోషల్ మీడియా మాధ్యమాలలో చేదు అనుభవం ఎదురైంది.

వివరాల్లోకి వెళితే ఇటీవల నేహా చౌదరి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.ఈ క్రమంలో ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తన లో దుస్తులు మరియు స్తనాల సైజు చెప్పాలంటూ అసభ్యకరంగా కామెంట్ చేశాడు.

దీంతో నేహా చౌదరి ఈ విషయంపై స్పందిస్తూ తనని తిట్టడానికి మాటలు కూడా దొరకలేదని అంతేకాకుండా ఒక మహిళను చూడగానే ఇలాగే తప్పుగా ఆలోచిస్తారా అంటూ ఫైర్ అయ్యింది.ఇలాంటి వారు సమాజంలో మహిళలకి ఎలాంటి గౌరవం ఇస్తారో తెలిసిందని అంతేగాక ఇలాంటి కామెంట్ల వల్ల ఇతరులకి ఇబ్బంది కలుగుతుందనే ఇంకిత జ్ఞానం లేకపోవడం చాలా బాధాకరమని రిప్లై ఇచ్చింది.

Advertisement

దీంతో ఒక్కసారిగా ఆ నెటిజన్ అవాక్కయ్యాడు.ఆ తర్వాత ఆ నెటిజన్ తన ప్రశ్నకి స్పందించినందుకు థాంక్స్ డార్లింగ్ అని, అలాగే సమాధానం తన ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్ప లేదంటూ మరోమారు మెసేజ్ కూడా చేశాడు.

దీంతో ఈ విషయాన్ని నేహ చౌదరి హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేసింది.దీంతో వెంటనే నెటిజన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేశాడు.

ఈ విషయంపై నేహా చౌదరి స్పందిస్తూ తనకు మెసేజ్ చేసిన తర్వాత ఆ వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేశాడని అయినప్పటికీ పోలీసులు అతడిని పట్టుకుంటారని తెలిపింది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు