ఈ హీరోయిన్ ఇక్కడ ఫట్.. కానీ అక్కడ మాత్రం స్టార్ హీరోయిన్...

తెలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీహరి నానో దర్శకత్వం వహించిన "తకిట తకిట" అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన కన్నడ బ్యూటీ "హరిప్రియ" గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే పర్వాలేదనిపించింది.

దీంతో మొదటగా హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమా అవకాశాలను దక్కించుకున్నప్పటికీ ఎందుకో ఎక్కువ కాలం తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా రాణించలేక పోయింది.దీంతో తిరిగి మూటాముల్లె సర్దుకొని మళ్ళీ కన్నడ సినీ పరిశ్రమకి వెళ్ళిపోయింది.

అయితే కన్నడ సినీ పరిశ్రమలో మాత్రం వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది.ఈ క్రమంలో కన్నడలో ప్రస్తుతం దాదాపుగా ఐదు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా ఎలాంటి పాత్రలోనైనా నటి హరిప్రియ సునాయాసంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆమె పెట్టింది పేరు.అందువల్లనే ఇప్పటివరకు పలు రకాల విభిన్న పాత్రలలో నటించి కన్నడలో స్టార్ హీరోయిన్ గా హరి ప్రియ రాణిస్తోంది.

Advertisement

మరోవైపు తెలుగులో కూడా అప్పుడప్పుడు అడపా దడపా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది.ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హరి ప్రియ తెలుగులో మంచి విజయం సాధించిన "ఎవరు" చిత్రం కన్నడ రీమేక్ లో కీలక పాత్రలో నటిస్తోంది.

అలాగే పెట్రోమాక్స్, హ్యాపీ ఎండింగ్, లాగాన్, తదితర చిత్రాలలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు