తెలంగాణ సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుపొందడంపై స్పందించారు.ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ ఈ గెలుపు అద్వితీయం అంటూ వ్యాఖ్యానించారు.
అక్కడి ఓటర్లను అభినందిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.ఇది నిజంగా ఆషామాషీ గెలుపు కాదు.
నియోజక వర్గ ప్రజలు చాలా గొప్పగా ఆలోచించి ఓట్లు వేశారు.వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను.
ఈ గెలుపుతో మాకు కొండంత బలం చేకూరినట్లు అయ్యిందన్నాడు.
ఈ గెలుపు మాకు టానిక్ వంటిది అని, తప్పకుండా ఈ గెలుపుతో మాకు బాధ్యత పెరిగిందని అన్నాడు.
ప్రభుత్వ పథకాల అమలు వల్లే ఈ గెలుపు సాధ్యం అయ్యిందని, ఇన్నాళ్లుగా అభివృద్దికి నోచుకోని ఆ నియోజక వర్గం బాధ్యతను తీసుకుంటామంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు.ఈ విజయంలో పాత్ర వహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎమ్మెల్యేగా గెలుపొందిన శానంపూడి సైదిరెడ్డిని కేసీఆర్ అభినందించారు.కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక ఏంటో ప్రజలే చెప్పకనే చెప్పారంటూ కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.







