తెలంగాణ సరే ఏపీలో జనసేన పోటీ చేస్తుందా ?

తెలంగాణలో జనసేన పార్టీ కి అంతగా బలం లేకపోయినా గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దిగింది.

కొద్ది రోజుల క్రితం తెలంగాణ పాలిటిక్స్ లోను యాక్టివ్ గా ఉండబోతున్నాము అంటూ జనసేన సంకేతాలు పంపింది.

దీంతో ఏపీ, తెలంగాణలో జనసేన రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నిస్తుందని అంతా భావించారు.కానీ అనూహ్యంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని, దీనికి ప్రత్యేక కారణాలు ఉన్నాయంటూ ఆ పార్టీ తరపు నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

దీంతో ఇప్పుడు ఏపీ లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందా ? లేదా ? అనే అనుమానం అందరిలోనూ వ్యక్తమవుతోంది.జనసేన పార్టీ రాజకీయ పార్టీగా అవతరించి ఏడేళ్ళు దాటుతున్నా ఇప్పటికి ఒకసారి మాత్రమే ఎన్నికల బరిలోకి వెళ్ళింది.

మిగతా ఎన్నికలకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తూనే వస్తోంది.ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదు అనే విషయం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తేలిపోయింది.

Advertisement

ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ బాధ నుంచి తొందరగానే తేరుకున్నారు.రాజకీయంగా వచ్చే ఎన్నికల నాటికి బలపడతామనే ఆశ పవన్ లో ఎక్కువ ఉంది.

అందుకే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కంటే తీవ్రస్థాయిలో అధికార పార్టీ వైసీపీ మీద విమర్శలు చేస్తూ తమ పార్టీ క్రెడిట్ ప్రజల్లో పెరిగేలా చూసుకుంటున్నారు.అయితే ఇప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయంపై పవన్ దృష్టి పెట్టలేకపోతున్నారు.

మొన్ననే నియోజకవర్గాల ఇంఛార్జీలను నియమించారు తప్ప గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం మీద దృష్టిపెట్టలేకపోతున్నారు.

ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే గ్రామస్థాయి రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి.దీంట్లో టిడిపి, వైసిపి బలమైన పార్టీలుగా ఉండడంతో జనసేన వారి ముందు నిలబడ గలుగుతుందా అనేది ఆ పార్టీ నేతలకు కూడా వస్తున్న డౌట్.ఈ పరిస్థితుల్లో అసలు జనసేన ఎన్నికల బరిలో నిలబడుతుందా లేక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో చేతులెత్తేసిన విధంగా ఇక్కడ కూడా అదే పని చేస్తుందా అనేది ఆ పార్టీ నుంచి అధికారిక ప్రకటన వస్తే గాని క్లారిటీ రాదు.

కిరణ్ అబ్బవరం భార్య అసలు పేరు మీకు తెలుసా.. ఆ షార్ట్ ఫిల్మ్ లో సైతం ఆమె నటించారా?
Advertisement

తాజా వార్తలు