వైరల్ వీడియో: కరిచింది ఏ పామో తెలియక రెండు పాములని చంపి ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యక్తి.. చివరికి?

పల్లెటూర్లు, పట్టణాలు, నగరాలు అడవులు ఇలా ప్రదేశం ఏదైనా సరే పాములు( Snakes ) సంచరించడం మామూలే.

అయితే జనసంద్రం ఉన్న ప్రాంతాలలో పాములు తిరగడం చాలా తక్కువ అదే చెట్లపొదులు ఇంకా మురికిగా ఉన్న ప్రాంతాలలో పాములు తన నివాసాలను ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తుంటాయి.

అయితే, అప్పుడప్పుడు అవి ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలోకి వచ్చి మనుషుల ప్రాణాలను తీస్తుంటాయి.పాములు ప్రజలను కాటు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.

అయితే, ప్రస్తుతం వైద్య సేవలు మెరుగుగా ఉండడంతో పాము కాటుకు( Snake Bite ) విరుగుడు సకాలంలో అందించి ప్రజల ప్రాణాలను కాపాడుకుంటున్నారు.ఇలా పాములు వాటి విషం మనిషి శరీరంలో ఉన్నప్పుడు ఏ పాము ఎలాంటి విషాన్ని శరీరంలోకి వదిలిందో తెలుసుకోవడానికి కొందరు వారిని కాటు వేసిన పాములను చంపి ఆసుపత్రులకు తీసుకువెళ్లడం సంబంధించిన అనేక ఘటనలను మనం సోషల్ మీడియా ద్వారా చాలానే చూశాము.తాజాగా ఇలాంటి సంఘటన మరోసారి తెలంగాణ రాష్ట్రంలో( Telangana ) జరిగింది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

Advertisement

నాగర్ కర్నూల్ జిల్లా( Nagar Kurnool ) ఉప్పునుంతల మండలంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.ఇంటి ఆరు బయట ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల చిన్నారి పాముకాటుకు గురైంది.ఏ పాము కరిచిందో స్పష్టత లేకపోవడంతో, కుటుంబసభ్యులు ఆ ప్రాంతంలో చనిపోయిన రెండు పాములను వెంట తీసుకొని చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రికి చేరుకున్న తర్వాత, స్నేక్ క్యాచర్ సుమన్‌ను సంప్రదించారు.ఆయన ఆ పాములను పరిశీలించి, అవి విషసర్పాలు కాదని నిర్ధారించారు.దీంతో కుటుంబసభ్యులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పేలిన టైరు.. అమాంతంగా గాలిలోకి ఎగిరిన మెకానిక్‌ (వీడియో)
Advertisement

తాజా వార్తలు