కుటుంబ పాలనతో తెలంగాణ నష్టపోయింది..: రాహుల్ గాంధీ

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.కుటుంబం, అవినీతి పాలన వలన తెలంగాణ నష్టపోయిందని ఆయన తెలిపారు.

ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఎస్సీల కోసం ఖర్చు చేయడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు.దళితబంధు పథకంలో అవినీతి జరిగిందన్న ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కమీషన్ ఇవ్వకుంటే దళితబంధు రాదని తెలిపారు.బీఆర్ఎస్, బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 గా ఉందన్నారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని పేర్కొన్నారు.గ్యాస్ సిలిండర్ ను రూ.500 కే అందిస్తామని హామీ ఇచ్చారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు