Telangana Tourism: తెలంగాణలో వికసిస్తున్న పర్యాటక రంగం

తెలంగాణ కోటి రతనాల వీణ.దక్కన్ పీఠభూమిలో ప్రకృతి రమనీయత, సహజ జలవనరులు, తటాకాలు, కొండలు, కోనలు,కోటలు,ఆధ్యాత్మిక ప్రాంతాలకు నిలయంగా నిలిచింది.

 Telangana Is A Booming Tourism Sector Details, Telangana, Tourism Sector, Telang-TeluguStop.com

ఇన్ని వైవిద్యమైన ప్రదేశాలు ఉన్న తెలంగాణ ప్రాంత పర్యాటక రంగం ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యంకు గురయింది.కనీసం ప్రచారానికి కూడా నోచుకోలేదు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ పర్యాటక రంగానికి నూతన జవసత్వాలు సంతరించుకుంటున్నాయి.తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, సహజ వనరులు,అభివృద్ధి పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలంగాణను టూరిజం డెస్టినేషన్ గా తీర్చిదిద్దుతున్నారు.

రాష్ట్ర పర్యాటక రంగమును అభివృద్ధి చేసి, తగు ప్రచుర్యo కల్పించి ప్రోత్సహించుటకు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ( టి ఎస్ టి డి సి) ని నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఈ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 54 హరిత టూరిజం హోటల్స్,వే సైడ్ వసతులను కల్పించింది.పర్యాటక రంగంమునకు అనువైన ప్రాంతాల్లో వసతులను అభివృద్ధి చేస్తున్నది.31 టూరిజం బస్సులు,120 బోట్స్ నడుపుతున్నది.గోల్కొండ, వరంగల్ కోట ల వద్ద సౌండ్ లైట్ షో లను నిర్వహిస్తున్నది.ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల్లో డ్రామాటిక్ గా ఈ కోటల కధనాలను గాత్రాలు, సంగీతం,లైట్ ఎఫెక్ట్ తో ప్రదర్శిస్తున్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న వసతులతో తెలంగాణ పట్ల దేశ విధేశీ పర్యాటకుల ఆసక్తి పెరిగింది.డోమెస్టిక్ టూరిజం గణనీయంగా వృద్ధిచెందింది.2014 నుండి 2022 జూలై వరకు తెలంగాణను 63 కోట్ల 51 లక్షల మంది డోమెస్టిక్ టూరిస్టులు సందర్శించారు.అలాగే 1 లక్ష 35 వేల మంది విదేశి టూరిస్టులు తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు.

ప్రభుత్వం చేపట్టిన పనులతో పోచంపల్లి కి ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రపంచ పర్యాటక సంస్థ నుంచి గుర్తింపు లభించింది.

Telugu Telangana, Tourisam Hotels, Tourism-Latest News - Telugu

నాగార్జున సాగర్ వద్ద 65 కోట్లతో బుద్ధవనం ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేసింది.ములుగు జిల్లా మేడారం గ్రామంలో ఉన్న సమ్మక్క – సారలమ్మ జాతరకు రూ.13.43 కోట్లతో పర్యాటక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.లక్నవరం వద్ద రూ.27.65 కోట్లతో అదనపు వసతులు కల్పించింది.తాడ్వాయిలో రూ.9.36 కోట్లు, గట్టమ్మ గుట్ట వద్ద రూ.7.36 కోట్లు, మల్లూరు వద్ద రూ.4.20 కోట్లు, బొగత వాటర్ ఫాల్స్ వద్ద రూ.11.64 కోట్లు, సోమశిల రిజర్వాయర్ వద్ద రూ.20.87 కోట్లు, సింగోటం రిజర్వాయర్ వద్ద రూ.7.84 కోట్లు, శ్రీశైలం ఈగలపెంట వద్ద రూ.25.96 కోట్లు, ఫర్హాబాద్ మన్ననూరు వద్ద రూ.13.81 కోట్లు, మల్లెల తీర్ధం వద్ద రూ.5.35 కోట్లు, అక్క మహాదేవి గుహలు వద్ద రూ.1.25 కోట్లతో కల్పించిన పర్యాటక వసతులను ప్రజలకు అందుబాటులో ఉంచింది.

Telugu Telangana, Tourisam Hotels, Tourism-Latest News - Telugu

వీటితో పాటు కోట్లాది రూపాయల వ్యయంతో హరిత పేరున పర్యాటక హోటల్స్ ను నిర్మించింది.ఆధునిక వసతులున్న వాటర్ ఫ్లీట్ బోట్స్, ఏ.సి, వొళ్వో బస్సులను నసుపుతున్నది.అనేక చారిత్రక కట్టడాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దుతున్నది.వీటితో పాటు అన్ని జిల్లాలలోని పర్యాటక ప్రాంతాల్లో వసతులు అభివృద్ధి చేసి అంతర్గత పర్యాటకాన్ని ప్రోత్సాహిస్తున్నది.కోవిద్ అనంతరం డోమెస్టిక్ తో పాటు విధేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నది.తెలంగాణ పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కళకళ లాడుతున్నాయి.

దీనితో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube