హైదరాబాద్ కుషాయిగూడ అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ పరిశీలించారు.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం బాధాకరమని తెలిపారు.
మృతుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మహమూద్ అలీ వెల్లడించారు.ప్రమాదానికి కారణమైన టింబర్ డిపో యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
అదేవిధంగా టింబర్ డిపోలను నగర శివారు ప్రాంతాలకు తరలిస్తామని వెల్లడించారు.







