సైంటిస్టులనే గడగడలాడిస్తున్న చాట్‌జీపీటీ.. నీటిని ఎలా వాడేస్తోందంటే..!

మేకింగ్ AI లెస్ థరస్టీ“( Making AI Less Thirsty ) అనే ఒక రీసెంట్ స్టడీ ఏఐ చాట్‌బాట్లు పర్యావరణానికి చేస్తున్న చేటు గురించి తెలిపి అందరికీ షాక్ ఇచ్చింది.ఓపెన్ఏఐకి చెందిన చాట్‌జీపీటీ( chatgpt ), గూగుల్‌కి చెందిన బార్డ్ వంటి పెద్ద ఏఐ మోడల్స్‌కు ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో పర్యావరణం పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది.

 Chatgpt, Which Is Making Scientists Getting Surprised.. How Is It Using Water ,-TeluguStop.com

ఈ మోడల్‌ల డేటా సెంటర్లను చల్లబరచడానికి భారీ మొత్తంలో స్థిరమైన విద్యుత్, నీరు అవసరం అని వివరించింది.

ఓపెన్ఏఐతో భాగస్వామ్యం కలిగి ఉన్న మైక్రోసాఫ్ట్, కేవలం జీపీటీ-3 ట్రైనింగ్‌లో 185,000 గ్యాలన్ల నీటిని వినియోగించిందని, ఇది అణు రియాక్టర్‌ను చల్లబరచడానికి అవసరమైన నీటి పరిమాణానికి సమానమని స్టడీ వెల్లడించింది.

దాదాపు 20-50 ప్రశ్నల, సమాధానాలతో కూడిన సాధారణ సంభాషణ కోసం చాట్‌జీపీటీకి 500 ml బాటిల్ నీరు అవసరమని కూడా అధ్యయనం పేర్కొంది.చాట్‌జీపీటీ బిలియన్ల కొద్దీ వినియోగదారులను పరిగణనలోకి తీసుకుంటే, దాని పనితీరుకు ఎంత పెద్ద మొత్తంలో నీళ్లు కావాల్సి వస్తుందో అర్థం చేసుకోవచ్చు.

సింపుల్‌గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చాట్‌జీపీటీ పెద్ద ఎత్తున నీటిని వాడేస్తోంది.

AI ట్రైనింగ్ డేటాను( AI training data ) చల్లబరచడానికి డేటా కేంద్రాలు నీటిని వివిధ మార్గాల్లో ఉపయోగిస్తాయి.ఉపయోగించిన నీటి పరిమాణం డేటా సెంటర్ లొకేషన్, రూపకల్పన, ఉపయోగించిన కూలింగ్ సిస్టమ్ టైప్, ప్రాంతం వాతావరణంపై ఆధారపడి ఉంటుంది.డేటా సెంటర్లలో రెండు ప్రధాన రకాల కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి.

అవే ఎయిర్-కూల్డ్, వాటర్-కూల్డ్.ఎయిర్-కూల్డ్ సిస్టమ్‌లు సర్వర్లు, పరికరాల చుట్టూ గాలిని ప్రసరించడానికి ఫ్యాన్‌లను ఉపయోగిస్తాయి.

అయితే వాటర్-కూల్డ్ సిస్టమ్‌లు డివైజ్ నుంచి వేడిని గ్రహించి ఎక్స్‌టర్నల్ కూలింగ్ టవర్ లేదా చిల్లర్‌కు రవాణా చేయడానికి నీటిని ఉపయోగిస్తాయి.

డేటా సెంటర్లలో ఉపయోగించే నీరు మంచినీటి వనరుల నుంచి వస్తుంది.ఇది కూలింగ్ టవర్ల ద్వారా గాలిలోకి విడుదల చేయబడుతుంది.అయినప్పటికీ, తుప్పు, బ్యాక్టీరియాను నివారించడానికి నీరు చాలా శుభ్రంగా, తాజాగా ఉండాలి.

మొత్తం మీద ఈ అధ్యయనం AI శిక్షణ పర్యావరణ ప్రభావం, స్థిరమైన పద్ధతులను ఉపయోగించడం పట్ల కంపెనీలకు ఉన్న బాధ్యత గురించి ప్రశ్నలను లేవనెత్తింది.ఇక పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా వీటి నీటి వినియోగాన్ని చూసి షాక్ అవుతున్నారు.

ChatGPT uses lot of water to train itself

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube