ఈ నిర్ణయంతో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న టీఆర్‌ఎస్ నేతల దశ తిరగనుందా.. !!

తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ పై పలురకాలైన ఊహాగానాలు ప్రచారంలోకి వస్తున్నాయి.తెలంగాణ ప్రజలను ఉద్యమం పేరుతో నాయకులు మోసం చేశారనే అపవాదులు ఇప్పటికే మూట గట్టుకుంటున్న గులాభి పార్టీకి గత కొన్ని రోజులుగా బీజేపీ నేతలు మేకుల్లా తయారైనట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

 Telangana Group 1 Officers Full Support To Trs Candidates In Graduate Mlc Electi-TeluguStop.com

ఈ క్రమంలోనే దుబ్బాక ఎన్నికల్లో అపజయం.గ్రేటర్ ఎన్నికల్లో ఊహించినంతగా మెజారిటీ దక్కించుకోలేక పోయిందట.

ఇదే సమయంలో తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వార్ తారాస్దాయికి చేరుకుంటుంది.ఇక ఈ ఎన్నికల్లో కూడా కారును పంక్చర్ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్, బీజేపీకి ఊహించని షాక్ తగిలిందట.

టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి, సురభి వాణీ దేవిలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్, హన్మంత్ నాయక్‌లు తెలిపారట.

అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే ఉద్యోగుల ఓట్లు చాలా కీలకం.

అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగుల మద్దతు కోసం అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో గ్రూప్ 1 అధికారులు గులాభి పార్టీ వైపు మొగ్గుచూపడం చర్చగా మారింది.మరి వీరి నిర్ణయంతో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న టీఆర్‌ఎస్ నేతల దశ తిరుగుతుందా.

లేదా.చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube