నేడు లాక్‌డౌన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ ప్రభుత్వం.. !

కరోనా సెకండ్ వేవ్ వల్ల దేశంలో కోవిడ్ రోగుల సంఖ్య విపరీతంగా పెరగడమే కాదు మరణాల సంఖ్య కూడా ఊహించని స్దాయిలో నమోదైన విషయం తెలిసిందే.ఇక అన్ని రాష్ట్రలు లాక్‌డౌన్ విధించిన తర్వాత అనేక సందేహాల మధ్య చివరికి తెలంగాణ రాష్ట్రం లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

 Telangana Govt, Key Decision, Lockdown, Today,latest-TeluguStop.com

ఇలా రెండు దఫాలుగా లాక్‌డౌన్ పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం రేపటితో ఆ గడువు ముగియనుండటం తో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్​ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్​ సమావేశమై లాక్​డౌన్​పై కీలక నిర్ణయం తీసుకోనుంది.ఈ నేపధ్యంలో ప్రభుత్వం అన్‌లాక్​ దిశగా ఆలోచిస్తుందనే ప్రచారం జరుగుతుంది.

కాగా పండ్లు, కూరగాయలు, కిరాణా షాపులకు ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దని, వాటిని ఎప్పటిలా తెరిచేలా నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది.కాగా మాల్స్​, సిన్మా టాకీసులు, రెస్టారెంట్లు, గేమింగ్​ జోన్లు, పబ్బులు, పార్కులు, క్లబ్​ హౌస్​ల వంటి వాటిని బంద్​ పెట్టేందుకు మొగ్గుచూపుతున్నది.

ఆ తర్వాత మరో వారం రోజులు నైట్ కర్ఫ్యూ మాత్రమే విధించాలని భావిస్తోందట.ఇక ఏ విషయం అనేది మరి కొద్దిగంటల్లో క్లారీటి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube