ధరణి సమస్యలకు రైతులు బలి..దిక్కుతోచని స్థితిలో కేసీఆర్?

తెలంగాణలో ధరణి వల్ల పేద రైతులకు లాభం కన్నా.నష్టమే ఎక్కువగా జరుగుతోంది.పైగా అధికారులు చేసిన ఆ తప్పులను ధరణిలో సరిదిద్దుకోవడానికి రూ.1000 చొప్పున ఫీజు చెల్లించాలనడం అన్యాయమని వారు వాపోతున్నారు.ఇక ధరణి సమస్యలపై వేసిన కేబినెట్ సబ్ కమిటీ చిన్న చిన్న పరిష్కారాలనే చూపగలిగింది.అన్ని రకాల సేవలు ఆన్​లైన్ చేయడం.​భూములు కొనుగోలు చేసే రియల్ ఎస్టేట్, కార్పొరేట్ సంస్థలకు మేలు చేసింది తప్ప సాధారణ రైతులకు ధరణి కష్టాలే మిగిల్చింది.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, మండల, జిల్లా స్థాయి ప్రజా కమిటీలను ఏర్పాటు చేసి తప్పులను సరిదిద్దాలని.

 Telangana Farmers Facing Troubles With Issues In Dharani Passbooks Details, Telangana Farmers , Issues In Dharani, Farmers Passbooks, Kcr, Telangana Government, Farmers, Revenue Officers, Real Estate, Crop Registrations-TeluguStop.com

దశాబ్దాలుగా ఏటా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రికార్డులను సరిచేసే విధానాన్ని కొనసాగించాలని రైతులు కోరుతున్నారు.

ధరణి వెబ్ సైట్ అమలులోకి వచ్చిన తర్వాత లోపాలన్నీ ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయి.

 Telangana Farmers Facing Troubles With Issues In Dharani Passbooks Details, Telangana Farmers , Issues In Dharani, Farmers Passbooks, Kcr, Telangana Government, Farmers, Revenue Officers, Real Estate, Crop Registrations-ధరణి సమస్యలకు రైతులు బలి..దిక్కుతోచని స్థితిలో కేసీఆర్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాదాపు 37వేల828 పాసుపుస్తకాలు చనిపోయిన పట్టాదారుల పేరుమీద వచ్చాయి.ఆధార్ తప్పుగా నమోదైనవి 27వేల520 ఉన్నాయి.

పాసుపుస్తకాల్లో పట్టాదారు పేరు తప్పుగా రాసినవి 17వేల069 అని తేలింది.వ్యవసాయేతర భూములకు 7,431 పాసుపుస్తకాలు ఇచ్చారు.

ఇక 45వేల803 పాసుపుస్తకాల్లో తక్కువ విస్తీర్ణం నమోదు చేయగా.ఎక్కువ విస్తీర్ణం రాసిన పాసుపుస్తకాలు 37వేల998 ఉన్నాయి.

ఒకే ఖాతాను రెండుచోట్ల రాసినవి 34వేల815 ఉంటే.సర్వే నెంబర్లలో తప్పులొచ్చినవి 12వేల682 ఉన్నాయి.

అటవీశాఖతో వివాదాలున్న భూములకు పాసుపుస్తకాలు ఇచ్చినవి10,879 కాగా మొత్తం భూవివాదాలు 2లక్షల65వేల653 బయటకువచ్చాయి.

Telugu Crop, Farmers, Dharani, Estate, Officers, Telangana-Latest News - Telugu

ఈ-సేవలో మరో రు.650 అదనంగా వసూలు చేస్తున్నారు.ఎన్ని మాడ్యూల్స్ నిర్ణయిస్తే అన్ని అంత మొత్తం రైతులు చెల్లించాలి.

అటువంటప్పుడే అధికారులు సవరణకు తీసుకుంటామని చెబుతున్నారు.ప్రభుత్వం చేసిన తప్పులకు రైతులను బాధ్యులను చేయడం, ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసం అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందితో బహిరంగ విచారణలు జరిపి ఎలాంటి ఫీజులు లేకుండా వాటిని చక్కదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు.సవరణలు చేసే అధికారం వివిధ స్థాయిల్లో తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు కల్పించాలని రైతులు కోరుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube