తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.ఈ మేరకు సీఈసీ రాజీవ్ కుమార్ షెడ్యూల్ ను వెల్లడించారు.
నవంబర్ 3వ తేదీన తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయన్న ఆయన మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ క్రమంలో నామినేషన్ల దాఖలుకు నవంబర్ 10 చివరి తేదీ అని పేర్కొన్నారు.నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉండగా నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 వరకు గడువు ఉంటుందన్నారు.
ఈ క్రమంలోనే నవంబర్ 30వ తేదీన తెలంగాణ ఎన్నికల పోలింగ్, డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్ జరుగుతుందని వెల్లడించారు.