కరోనా యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులో జాగ్రత్త.. అది వస్తే !

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.దీంతో ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి చోట కరోనా యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులను నిర్వహిస్తోందని అందరికి తెలిసిన సంగతే.

అయితే తాజాగా వైద్య నిపుణులు ఈ టెస్టు గురించి తెలియని విషయాలను చెబుతున్నారు.కరోనాను కట్టడి చేయడంలో ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ విధానాన్ని నమ్ముకోవాలని సూచిస్తున్నారు.

కరోనా లక్షణాలు కనిపించిన వారిని గుర్తించి చికిత్స అందిస్తే వైరస్ ను అరికట్టవచ్చని డబ్ల్యూహెచ్ఓ సహా నిపుణులు పేర్కొంటున్నారు.తెలంగాణలో కరోనా నిర్ధారణకు మొదటగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసుకునే వారు.

అప్పుడు ఫలితాలు 2-3 రోజుల తర్వాత వచ్చేవి.కానీ ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నప్పటి నుంచి ఫలితాలు గంటలోనే వస్తున్నాయి.

Advertisement

ఇందులో కొందరికి పాజిటివ్ వస్తుండగా.మరికొందరికి నెగిటివ్ వస్తోంది.

ర్యాపిడ్ టెస్టుల్లో కరోనా పాజిటివ్ వస్తే శరీరంలో వైరస్ ఉన్నట్లని, కానీ నెగిటివ్ వస్తే నిర్లక్ష్యం వహించవద్దన్నారు.నెగిటివ్ వచ్చిన వారికి కొన్ని రోజుల తర్వాత కరోనా లక్షణాలు వెలువడి పాజిటివ్ వస్తుందన్నారు.

వైరస్ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ర్యాపిడ్ టెస్టుల్లో కరోనా పాజిటివ్ వస్తుందని, ఇన్ఫెక్షన్ స్థాయి తగ్గి నెగిటివ్ వచ్చినా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు.ఈ పరీక్షల్లో ఊపిరితిత్తులకు సిటీ స్కాన్ చేసి ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చన్నారు.

ర్యాపిడ్ టెస్టుల్లో నెగిటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు