స్పీడ్ పెంచిన టి.కాంగ్రెస్ ! యాక్షన్ ప్లాన్ ఏంటంటే .. ? 

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్( Congress Party ) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఇటీవల కాలంలో నిర్వహించిన వివిధ సర్వేలలోను కాంగ్రెస్ గెలుపునకు అవకాశం ఉందన్న సంకేతాలు ఆ పార్టీలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.

దీనికి తోడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్సాహాన్ని పెంచాయి.బీ ఆర్ ఎస్ కు ( BRS ) ప్రధాన పోటీ కాంగ్రెస్ నుంచి ఎదురుకాబోతుండడం,  బిజెపి గ్రాఫ్ గతం కంటే బాగా తగ్గడం , ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం,  ఇవన్నీ కాంగ్రెస్ కు కలిసి వస్తున్నాయి.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యాక్షన్ ప్లాన్ కు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.ఈ మేరకు వరుస వరుసగా భారీ బహిరంగ సభలు , సమావేశాలు , జిల్లాలు,  నియోజకవర్గాల వారికి పర్యటనలు చేపట్టే ఆలోచనతో తెలంగాణ కాంగ్రెస్ ఉంది.

దీనిలో భాగంగానే ఖమ్మం హైదరాబాద్ నిర్మల్ లో వరుసగా బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది.ఈ నెల 25 , 26 తేదీల్లో జరిగే బహిరంగ సభల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జూపల్లి కృష్ణారావులను పార్టీలో చేర్చుకునే ఆలోచనతో ఉంది.అలాగే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) చేపట్టిన పాదయాత్ర ఖమ్మం పట్టణంలో ముగియనుంది.

Advertisement

దీంతో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది.ఈ సభకు ముఖ్యఅతిథిగా ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేదా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరు కాబోతుండడం తో జూన్ 12న ఏఐసిసి ఆధ్వర్యంలో తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యాక్షన్ ప్లాన్ అమలు చేసేందుకు సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఈ రోజు అమెరికా  రాబోతున్నారు.

హైదరాబాదులో భారీ బహిరంగ సభను నిర్వహించి, ఇతర పార్టీలలోని బలమైన నేతలను చేర్చుకునే ఆలోచనతో కాంగ్రెస్ ఉంది.విస్తృతంగా ప్రియాంక గాంధీతో తెలంగాణలో పర్యటనలు చేయించి భారీ బహిరంగ సభ నిర్వహించే విధంగా తెలంగాణ కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో బీ ఆర్ ఎస్, బిజెపిలను ఓడించి తెలంగాణలో అధికారం చేపట్టాలనే దిశగా తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య గ్రూపు రాజకీయాలు తగ్గుముఖ పట్టడం,  నాయకులంతా సమన్వయంతో ముందుకు వెళుతూ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో పని చేస్తూ ఉండడం, ఇవన్నీ తెలంగాణ కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశాలగానే కనిపిస్తున్నాయి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు