తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనుంది.ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలోనే మొత్తం 13 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది.ఇప్పటికే సిరిసిల్ల రాజయ్య( Siricilla Rajaiah )కు ఫైనాన్స్ కమీషన్ ఛైర్మన్ పోస్టును ఇచ్చిన సంగతి తెలిసిందే.

కాగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha elections ) మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఎంపీ టికెట్ ఇవ్వలేని వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని యోచిస్తోంది.







