తెలంగాణ కాంగ్రెస్ కు మరో ఎమ్మెల్యే షాక్!  

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరడానికి రెడీ అవుతున్న ఎమ్మెల్యే హరిప్రియ నాయక్..

  • తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు, తాజాగా కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడు కూడా కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి రెడీ అయిపోయారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ టిఆర్ఎస్ బిఫారం మీద ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా వాళ్ళు ప్రకటించారు.

  • ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీకి అమ్మకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చింది ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ టిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేసింది. అవసరం అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని కూడా ఆమె స్పష్టం చేసింది. త్వరలో కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు అధికారికంగా ధ్రువీకరించిన ఆమె, టిఆర్ఎస్ పార్టీ తోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమని కూడా తెలియజేసింది‌.